Asianet News TeluguAsianet News Telugu

ఇట్స్ కన్ఫర్మ్ : అనుష్క ప్రెగ్నెన్సీ నిజమే, సీక్రెట్ రివీల్ చేసిన డివిలియర్స్ .. కోహ్లీకి రెస్ట్ అందుకేనా..?

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై వీరిద్దరూ స్పందించలేదు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ , విరాట్ స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు.

Its Confirmed! Virat Kohli & Anushka Sharma Expecting Their 2nd Child, Reveals AB De Villiers ksp
Author
First Published Feb 3, 2024, 6:37 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై వీరిద్దరూ స్పందించలేదు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ , విరాట్ స్నేహితుడు ఏబీ డివిలియర్స్ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. అనుష్క , విరాట్ దంపతులు ఈ ఏడాది తల్లిదండ్రులు కానున్నారని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ధృవీకరించాడు. 

డివిలియర్స్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేస్తుండగా కోహ్లీ గురించి ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలోనే డివిలియర్స్ ప్రపంచానికి ఈ శుభవార్తను తెలియజేశాడు. తాను కోహ్లీకి మెసేజ్ చేశానని, దీనిపై అతను స్పందించాడని.. కానీ ఎక్కువ సమాచారం ఇవ్వలేదని ఏబీ అన్నాడు. కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడని.. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు విరాట్ దూరంగా వుండటానికి అదే కారణమని డివిలియర్స్ వెల్లడించారు. 

 

 

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. ఇదే కారణంతో గత నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20కి కూడా ఆయన దూరమయ్యాడు. కోహ్లీ తరచుగా క్రికెట్‌కు ఎందుకు విరామం తీసుకుంటున్నాడో భారత క్రికెట్ అభిమానులు, అనుచరులకు తెలుసు. అయితే డివిలియర్స్ ఇప్పుడు కోహ్లీ గైర్హాజరుపై అన్ని సందేహాలను తొలగించారు.

అనుష్క మరోసారి గర్భం దాల్చినట్లుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ ఈ స్టార్ కపుల్ ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. అనుష్క తన బేబీ బంప్‌తో బహిరంగంగానే కనిపించగా.. ఇది ఆమె గర్భం దాల్చిన విషయాన్ని ధృవీకరిస్తోంది. ప్రస్తతుం కోహ్లీ దంపతులకు వామికా అనే ఆడపిల్ల వున్న సంగతి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios