Ishan Kishan: "ప్రతిసారి నన్ను నేను ప్రశ్నించుకునేవాడిని"

IND vs AUS: టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో యంగ్ టీమిండియా అద్భుత ఆట తీరుతో  ఆస్ట్రేలియాను ఓడించింది. భారత్ విజయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు. టీమ్ ఇండియా విజయం తర్వాత ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. సూర్యకుమార్‌తో జరిగిన సంభాషణ ఇన్నింగ్స్‌లో తనకు ఎలా సహాయపడిందో వివరించారు. 

Ishan Kishan Says He Trains Hard During World Cup For India vs Australia T20 Series KRJ

India vs Australia: టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి ఆస్ట్రేలియాను ఓడించింది. భారత్ విజయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించారు. సూర్య 80 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఇషాన్ 58 పరుగులు చేశాడు. జట్టు కిష్ట సమయంలో ఉన్నప్పుడూ ఇరువురు ముఖ్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత రింకు సింగ్ 14 బంతుల్లో అజేయంగా 22 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఓవరాల్‌గా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ కిషన్ దీనిని ' ఆల్ రౌండ్ ప్రదర్శన' అని పేర్కొన్నాడు.

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో కిషన్ మాట్లాడుతూ 'వన్డే ప్రపంచకప్‌లో తుది జట్టులో నేను ఆడనప్పటికీ ప్రాక్టీస్ సెషన్‌ లో క్రమం తప్పకుండా పాల్గొనేవాడినని తెలిపారు. ‘ఇప్పుడు ప్రాక్టీస్ ఎందుకు. నేను ఏమి చెయ్యగలను? అని ప్రతి ప్రాక్టీస్ సెషన్‌ ముందు నన్ను నేను ప్రశ్నించుకునే వాడిని. ఆట గురించి, మ్యాచ్‌ని చివరి వరకు ఎలా తీసుకెళ్లాలి, ఫలానా బౌలర్లను ఎలా టార్గెట్ చేయాలి అనే విషయాల గురించి నేను కోచ్‌తో నిరంతరం మాట్లాడేవాడిని.’ అని ఇషాన్ కిషన్ చెప్పారు.

లెగ్ స్పిన్నర్లకు వ్యతిరేకంగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు. 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేసి తరువాత బ్యాటింగ్ చేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు.. భారీ షాట్లు ఆడుతూ.. బౌలర్లను లక్ష్యంగా చేసుకోవాలి. ఆ విషయాన్నే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాను. సంఘాకి వ్యతిరేకంగా పెద్ద షాట్లు ఆడతానని చెప్పాను. అతను ఎప్పుడు బౌలింగ్ చేసినా దూకుడుగా ఆడాను ’ అని ఇషాన్ కిషన్ చెప్పారు.
  
రింకూ సింగ్ గురించి మాట్లాడుతూ.. రింకూ ఐపీఎల్‌లోనూ, ఆ తర్వాత దేశవాళీ మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా రాణించి, ఇక్కడికి వచ్చి ఆస్ట్రేలియాతో ఆడిన తర్వాత తాను ఆడిన షాట్లలో సహనాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అతను ఈ రోజు అద్భుతంగా ఉన్నాడని నేను భావిస్తున్నానని తెలిపారు. కాగా, ప్రపంచకప్‌ 2023లో శుభ్‌మన్ గిల్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడకపోవడంతో ఇషాన్ కిషన్ కు స్థానం లభించింది. కానీ,  పాక్‌తో మ్యాచ్‌కు గిల్ తుది జట్టులోకి రావడంతో అతను బెంచ్‌కే పరిమితం కావాల్సివచ్చింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios