టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉండగా అతడి భార్య ధనశ్రీ వర్మ మాత్రం..!
భారత క్రికెట్ జట్టు వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు కొంతకాలంగా తన భార్య, ప్రముఖ యూట్యూబర్ ధనశ్రీ వర్మతో విభేదాలు వచ్చాయని పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్యలోకి మరో క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ వచ్చాడని.. అయ్యర్ కారణంగానే చాహల్ - ధనశ్రీల వ్యవహారం విడాకుల వరకూ దారి తీశాయని నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ ఇద్దరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, స్టోరీలు కూడా ఇదే విషయాన్ని మరోసారి అనుమానాలకు తావిస్తున్నాయి.
శ్రేయాస్ అయ్యర్ తాజాగా ముంబైలోని ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ లో వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి ఇన్‌స్టాలో వైరల్ అవుతోంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ తర్వాత అయ్యర్ వెన్ను గాయానికి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం రికవరీ మోడ్ లో ఉన్నాడు.
వాళ్లంతా ఎన్సీఏలో.. మరి అయ్యర్ ఏం చేస్తున్నట్టు..?
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్, వెన్ను గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జస్ప్రిత్ బుమ్రా, తొడ గాయానికి సర్జరీ చేయించుకున్న కెఎల్ రాహుల్‌లు ప్రస్తుతం ఎన్సీఏలో రిహాబిటేషన్ పొందుతున్నారు. ఆసియా కప్ వరకైనా భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కెఎల్ రాహుల్, బుమ్రాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరితో పాటు ఎన్సీఏలో ఉండాల్సిన అయ్యర్ ముంబైలో ఏం చేస్తున్నాడనేది సమాధానం దొరకని ప్రశ్న.
ధనశ్రీ కూడా..
నిప్పులేనిదే పొగ రాదన్నట్టుగా ధనశ్రీతో అయ్యర్ వ్యవహారం ఈనాటిది కాదు.. చాలాకాలంగా ఆమె వెళ్లే ప్రైవేట్ పార్టీలకు అయ్యర్ కూడా వెళ్లడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న వాదన అయితే సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. తాజాగా ధనశ్రీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో అచ్చంగా అయ్యర్ పెట్టినట్టే ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్ లో డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టా స్టోరీస్ లో రాత్రిపూట వెలుగు జిలుగులలో మెరిసిపోతున్న ముంబైని ఫోటో తీసి ‘ముంబై లవ్’ అని పోస్ట్ చేసింది. అచ్చంగా ఇదే తరహాలో అయ్యర్ కూడా తన ఇన్‌స్టా స్టోరీస్ లో ధనశ్రీ పోస్ట్ చేసిన బిల్డింగ్ ను పోలి ఉన్న ఫోటోనే అప్లోడ్ చేయడం అనుమానాలకు తావిచ్చింది.
అదే ఇదా..?
అయితే అయ్యర్ - ధనశ్రీల ఇన్‌స్టా పోస్టులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముంబైలో ఇలాంటి అపార్ట్‌మెంట్స్ కోకొల్లలు ఉన్నాయని.. ఇద్దరూ వేర్వేరు భవంతుల్లో ఉన్నారని కొంతమంది వాదిస్తున్నారు. మరికొంతమంది మాత్రం అయ్యర్ - ధనశ్రీలు చాహల్ కొంపలో కుంపటి పెట్టారని, గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలకు తాజా వీడియో మరింత రుజువుఅని.. ఈ ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్ లో ఉన్నారన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు.