ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫైయర్స్‌లో 5 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ఐర్లాండ్... స్కాట్లాండ్‌తో కలిసి టీ20 వరల్డ్ కప్‌కి అర్హత..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఐర్లాండ్ జట్టు, టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ యూరప్ క్వాలిఫైయర్స్‌లో 5 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న ఐర్లాండ్, జర్మనీతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో... టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి క్వాలిఫై అయ్యింది...
డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో నెగ్గిన స్కాట్లాండ్, లీగ్ స్టేజీలో 5కి 5 మ్యాచుల్లో గెలిచి.. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి అర్హత సాధించింది. రెండో స్థానంలో ఉన్న ఐర్లాండ్ కూడా యూరప్ నుంచి టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ ఆడబోతుండగా మిగిలిన పొజిషన్ కోసం జెర్మనీ, జెర్సీ, ఇటలీ పోటీపడుతున్నాయి. ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న డెన్మార్క్, 6 మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన ఆస్ట్రియా... పోటీ నుంచి నిష్కమించాయి..
ఇటలీతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన ఐర్లాండ్, డెన్మార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆస్ట్రియాతో మ్యాచ్‌లో 128 పరుగుల తేడాతో విజయం అందుకున్న ఐర్లాండ్, జెర్సీపై 9 వికెట్ల తేడాతో విజయం అందుకుంది..
ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫైయర్స్‌లో పాపువా న్యూ గినియా, జపాన్ జట్లు ముందంజలో ఉన్నాయి. ఆసియా క్వాలిఫైయర్స్‌లో రెండు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్న మలేషియా టాప్‌లో ఉంది. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులకి ఆలౌట్ అయిన చైనా, థాయిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో 4 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయాన్ని అందుకున్న ఐర్లాండ్, గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది. శ్రీలంక, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఓమన్... సూపర్ 6 రౌండ్‌కి అర్హత సాధించాయి. ఇందులో టాప్ 2లో నిలిచిన శ్రీలంక, నెదర్లాండ్స్... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోతున్నాయి..
2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది ఐర్లాండ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 327 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే కెవిన్ ఓ బ్రెయిన్ 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్సర్లతో 113 పరుగులు చేయగా ఈ భారీ లక్ష్యాన్ని 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది ఐర్లాండ్..
2022 ఐర్లాండ్ టూర్‌లో జరిగిన రెండో టీ20లో టీమిండియాకి దాదాపు షాక్ ఇచ్చినంత పని చేసింది ఐర్లాండ్. దీపక్ హుడా సెంచరీ కారణంగా టీమిండియా 20 ఓవర్లలో 225 పరుగులు చేయగా ఈ లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 221 పరుగులు చేసిన ఐర్లాండ్, 4 పరుగుల తేడాతో విజయాన్ని మిస్ చేసుకుంది..
