Asianet News TeluguAsianet News Telugu

IPL2022 SRH vs CSK: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ధోనీపైనే భారం వేసిన సీఎస్‌కే...

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... సీఎస్‌కే కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రీఎంట్రీ... 

IPL2022 SRH vs CSK:  SunRisers Hyderabad won the toss and elected to field first, CSK depends on MSD
Author
India, First Published May 1, 2022, 7:05 PM IST | Last Updated May 1, 2022, 7:10 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ సాధించిన తొలి విజయం ఇదే. సీఎస్‌కేతో దక్కిన తొలి విజయం తర్వాత వరుసగా 5 మ్యాచుల్లో నెగ్గిన ఆరెంజ్ ఆర్మీ, గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది... పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే నెట్ రన్ రేట్ కారణంగా టాప్ 3 పొజిషన్‌కి దూసుకెళ్తుంది...


చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి రవీంద్ర జడేజా తప్పుకోవడంతో మళ్లీ ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో బరిలో దిగుతోంది సీఎస్‌కే. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో నాలుగు టైటిల్స్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్, ఈసారి తిరిగి విన్నింగ్ ఫామ్‌లోకి వస్తుందని ఆశపడుతున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్... 

ఈ సీజన్‌లో మొదటి 8 మ్యాచుల్లో రెండు విజయాలు మాత్రమే అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచి తీరాల్సిందే... ఈ సీజన్‌లో అటు బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌లో ఘోరంగా విఫలమవుతూ వస్తున్న రవీంద్ర జడేజా, నేటి మ్యాచ్‌లో తిరిగి సాధారణ ప్లేయర్‌గా బరిలో దిగుతుండడంతో పూర్త ఫామ్‌లోకి వస్తాడని ఆశపడుతున్నారు చెన్నై అభిమానులు... 

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ బీభత్సమైన ఫామ్‌లో ఉంది. ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌తో పాటు టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్ అదరగొడుతున్నారు. గత మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 4 సిక్సర్లు ఇవ్వడం మినహా మార్కో జాన్సెన్ కూడా అంతకుముందు మ్యాచుల్లో మంచి పర్ఫామెన్స్ చూపించి, సన్‌రైజర్స్‌కి విజయాలు అందించాడు...

బ్యాటింగ్‌లో అయిడిన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, శశాంక్ సింగ్ చెలరేగుతున్నారు. మిడిల్ ఆర్డర్ అద్భుతంగా రాణించడంతో వరుసగా మ్యాచుల్లో 8 వికెట్లు, 7 వికెట్ల తేడాతో భారీ విజయాలు అందుకుంది సన్‌రైజర్స్... 

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌లో అంబటి రాయుడితో పాటు శివమ్ దూబే మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే శివమ్ దూబేని తప్పించిన మాహీ, సిమ్రాన్‌జిత్ సింగ్‌కి అవకాశం ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటు నుంచి కూడా కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు వచ్చాయి. 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, డివాన్ కాన్వే, అంబటి రాయుడు, సిమ్రాన్‌జిత్ సింగ్, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ, మిచెల్ సాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్, ముకేశ్ చౌదరి, మహీశ్ తీక్షణ

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios