రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న కేకేఆర్... నాలుగో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం జోడించి, కోల్‌కత్తా గెలిపించిన రింకూ సింగ్, నితీశ్ రాణా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన తర్వాత ఎట్టకేలకు కీలక మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది కేకేఆర్. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచి, సీజన్‌లో నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది...
153 పరుగుల లక్ష్యఛేదనలో కేకేఆర్‌కి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో 4 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 16 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన బాబా ఇంద్రజిత్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అశ్విన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యడు..
ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రాణా కలిసి మూడో వికెట్‌కి 60 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 32 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
నితీశ్ రాణా, రింకూ సింగ్ కలిసి భాగస్వామ్యం నిర్మించడంపైనే ఫోకస్ పెట్టారు. 18 బంతుల్లో 31 పరుగులు కావాల్సిన దశలో యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో 13 పరుగుల రాబట్టాడు రింకూ సింగ్. దీంతో ఆఖరి 2 ఓవర్లలో 19 పరుగులు కావాల్సి వచ్చాయి.
19వ ఓవర్‌లో 3 వైడ్ల రూపంలో 17 పరుగులు రాగా, ఆఖరి ఓవర్ మొదటి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు నితీశ్ రాణా... నితీశ్ రాణా 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేయగా, రింకూ సింగ్ 23 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సీజన్‌లో ఇప్పటికే 500+ పరుగులు చేసిన జోస్ బట్లర్ కూడా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లను ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడ్డట్టు కనిపించాడు...
5 బంతుల్లో 2 పరుగులు చేసిన ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్‌లో మిగిలిన 5 బంతులు ఎదుర్కొన్న సంజూ శాంసన్ పరుగులు చేయలేకపోవడంతో ఉమేశ్ యాదవ్‌కి మెయిడిన్ లభించింది...
ఉమేశ్ యాదవ్ వేసిన 5వ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టిన సంజూ శాంసన్, బట్లర్ జోడి.. అనుకుల్ రాయ్ వేసిన 6వ ఓవర్‌లో 11 పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ స్కోరు 38 పరుగులకు చేరుకుంది.
25 బంతులాడి 3 ఫోర్లతో 22 పరుగులు మాత్రమే చేసిన జోస్ బట్లర్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో శివమ్ మావికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టూ డౌన్‌లో వచ్చిన కరణ్ నాయర్ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసి అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
14వ ఓవర్ ఆఖరి బంతికి రియాన్ పరాగ్ సిక్స్ కొట్టడంతో 100 మార్కు అందుకుంది రాజస్థాన్ రాయల్స్. 12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసిన రియాన్ పరాగ్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఆ తర్వాతి బంతికి సంజూ శాంసన్ కూడా అవుటై పెవిలియన్ చేరాడు. 49 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసిన సంజూ శాంసన్, శివమ్ మావి బౌలింగ్‌లో రింకూ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
టిమ్ సౌథీ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన సిమ్రాన్ హెట్మయర్ 20 పరుగులు రాబట్టాడు.
