టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్‌తో...
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటిదాకా ఐపీఎల్ 2022 సీజన్‌లో టాస్ గెలిచిన జట్లన్నీ ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో 21 మ్యాచుల్లో వరుసగా టాస్ గెలిచిన జట్లు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఇదే రికార్డు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, మొదటి మూడు మ్యాచుల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇప్పటిదాకా పరాజయం ఎరుగని హార్ధిక్ పాండ్యా టీమ్, నేటి మ్యాచ్‌లో గెలిచి టేబుల్ టాప్ పొజిషన్‌కి వెళ్లాలని భావిస్తోంది... ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచిన మొదటి జట్టుగా నిలుస్తుంది.
శుబ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉండడం, గుజరాత్ టైటాన్స్‌కి కలిసొచ్చే అంశం. గత రెండు మ్యాచుల్లో 80+ స్కోర్లు బాదిన శుబ్‌మన్ గిల్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
శుబ్‌మన్ గిల్‌తో పాటు రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, హార్ధిక్ పాండ్యా కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. ఓపెనర్ మాథ్యూ వేడ్ మాత్రం ఇప్పటిదాకా మెరుపులు మెరిపించలేకపోయాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ విభాగం కూడా దుర్భేద్యంగా కనిపిస్తోంది. రషీద్ ఖాన్, లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీ సూపర్ ఫామ్‌లో ఉండగా గత మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన దర్శన నాల్కండే కూడా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు.
మరోవైపు మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ని ఓడించిన జోషన్‌ని కొనసాగిస్తూ, నేటి మ్యాచ్‌లో విజయం అందుకోవాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది ఆరెంజ్ ఆర్మీ...
పేస్ బౌలర్లు భువీ, నటరాజన్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మంచి టచ్‌లో కనిపిస్తుండడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కలిసొచ్చే అంశం. ఉమ్రాన్ మాలిక్ 150+ వేగంతో బంతులు విసురుతున్నా వికెట్లు తీయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు...
అభిషేక్ శర్మ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా రాహుల్ త్రిపాఠి మంచి ఇన్నింగ్స్‌లతో రాణించాడు. అయితే నికోలస్ పూరన్, కేన్ విలియంసన్‌ల నుంచి వారి రేంజ్ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఇరు జట్లు కూడా గత మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లతోనే బరిలో దిగుతున్నాయి...
గుజరాత్ టైటాన్స్ జట్టు ఇది: మాథ్యూ వేడ్, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నాల్కండే
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇది: అభిషేక్ శర్మ, కేన్ విలియంసన్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, అయిడిన్ మార్క్‌రమ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
