సాయి కిషోర్‌ని రూ.3 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది...
IPL2022 Auction: ముగిసిన మొదటి రోజు వేలం...

IPL2022 Auction: క్రికెట్ అభిమానులతో పాటు పది ఫ్రాంచైజీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం రానే వచ్చింది. బెంగళూరు (ఐటీసీ గార్డెన్ హోటల్) వేదికగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ‘నోట్లాట’ మొదలైంది. ఐపీఎల్-15 సీజన్ కోసం జరుతుతున్న ఈ పైసల కొట్లాట లో ఏ ఆటగాడు ఎంత దక్కించుకుంటారనేదే ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్..
గుజరాత్ టైటాన్స్‌లోకి సాయి కిషోర్...
సన్‌రైజర్స్‌లోకి సుచిత్...
జగదీశ సుచిత్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
సన్‌రైజర్స్‌లోకి శ్రేయాస్ గోపాల్...
శ్రేయాస్ గోపాల్ కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి... సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.75 లక్షలకు శ్రేయాస్ గోపాల్‌ను దక్కించుకుంది.
రాయల్స్‌లోకి కరియప్ప...
కేసీ కరియప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
ముంబైలోకి మురగన్ అశ్విన్...
మురగన్ అశ్విన్‌ని రూ.1.6 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
ఆవేశ్ ఖాన్‌కి రూ.10 కోట్లు...
ఆవేశ్ ఖాన్‌ని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్...
ఆర్‌సీబీలోకి అక్ష్‌దీప్...
అక్ష్‌దీప్ సింగ్‌ను రూ.20 లక్షలకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది.
సీఎస్‌కేలోకి అసిఫ్...
కెఎం అసిఫ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.
కార్తీక్ త్యాగికి రూ.4 కోట్లు...
కార్తీక్ త్యాగి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడ్డాయి. ఎట్టకేలకు సన్‌రైజర్స్ రూ.4 కోట్లకు కార్తీక్ త్యాగిని దక్కించుకుంది...
ముంబైలోకి తంపి...
బాసిల్ తంపిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...
పంజాబ్ కింగ్స్‌కి జితేశ్ శర్మ...
జితేశ్ శర్మను పంజాబ్ కింగ్స్ జట్టు రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది...
కేకేఆర్‌లోకి జాక్సన్...
షెల్డన్ జాక్సన్‌ను కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది...
పంజాబ్ కింగ్స్‌లోకి ప్రభుసిమ్రాన్ సింగ్...
ప్రభుసిమ్రాన్ సింగ్‌ను రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్.
రూ.3.4 కోట్లకు అనుజ్ రావత్...
వికెట్ కీపర్ అనుజ్ రావత్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. రూ.3.4 కోట్లకు అనుజ్ రావత్‌ని కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...
కెఎస్ భరత్‌కు రూ.2 కోట్లు...
తెలుగు వికెట్ కీపర్ కెఎస్ భరత్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.
ఆర్‌సీబీలోకి అహ్మద్...
షాబాజ్ అహ్మద్‌ని రూ.2.4 కోట్లకు తిరిగి జట్టులోకి తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
హర్‌ప్రీత్ బ్రార్‌ని రూ.3.8 కోట్లు...
కమ్లేశ్ నాగర్‌కోటిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్‌ని రూ.3.8 కోట్లకు పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది.
తెవాటియాకి బంపర్ ప్రైజ్...
ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా కోసం ఏకంగా రూ.9 కోట్లు చెల్లించడానికి సిద్ధమైంది గుజరాత్ టైటాన్స్...
శివమ్ మావికి రూ.7.25 కోట్లు...
కేకేఆర్ బౌలర్ శివమ్ మావిని తిరిగి రూ.7.25 కోట్లకు సొంతం చేసుకుంది ఆ జట్టు...
షారుక్ ఖాన్‌ని రూ.9 కోట్లు...
భారీ హిట్టర్ షారుక్ ఖాన్‌ని రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...