Asianet News TeluguAsianet News Telugu

IPL2021 SRH vs RR: హమ్మయ్యా... సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది భయ్యో... కేన్ మామ కెప్టెన్ ఇన్నింగ్స్‌...

60 పరుగులు చేసిన జాసన్ రాయ్, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన కేన్ విలియంసన్... రాజస్థాన్ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం...

IPL2021 SRH vs RR: Sunrisers Hyderabad won the match, kane williamson captaincy Innings
Author
India, First Published Sep 27, 2021, 11:06 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఎట్టకేలకు రెండో విజయాన్ని అందుకోగలగింది. ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

గత మ్యాచ్‌ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, జట్టులో నాలుగు మార్పులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ మార్పులతో లాభపడింది... 165 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. వృద్ధిమాన్ సాహా, జాసన్ రాయ్ కలిసి తొలి వికెట్‌కి 57 పరుగులు జోడించారు.

11 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన సాహా, లోమ్రోర్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు...ఆ తర్వాత జాసన్ రాయ్, కేన్ విలియంసన్ కలిసి రెండో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 42 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేసిన జాసన్ రాయ్, చేతన్ సకారియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత ప్రియమ్ గార్గ్ డకౌట్ అయినా... అభిషేక్ వర్మ, కేన్ విలియంసన్ కలిసి మ్యాచ్‌ను ముగించారు... కేన్ విలియంసన్ 41 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా... అభిషేక్ శర్మ 16 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు...

Follow Us:
Download App:
  • android
  • ios