Asianet News TeluguAsianet News Telugu

IPL2021 SRH vs PBKS: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... పంజాబ్‌ కింగ్స్‌కి కీలకంగా...

టాస్ గెలిచిన కేన్ విలియంసన్.. బౌలింగ్ చేసేందుకు నిర్ణయం... పంజాబ్ కింగ్స్‌కి కీలకంగా మారిన విజయం...

IPL2021 SRH vs PBKS: SunRisers Hyderabad won the toss and elected to bowl first
Author
India, First Published Sep 25, 2021, 7:12 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, పరువు కాపాడుకోవడం కోసమే మ్యాచులు ఆడాల్సి ఉంది...మరోవైపు గత మ్యాచ్‌లో విజయం దాకా వచ్చి 2 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్... ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచులు గెలవాల్సిందే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి దక్కిన ఏకైక విజయం పంజాబ్ కింగ్స్‌పైనే కావడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే విషయం...

పంజాబ్ జట్టు: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, మార్క్‌రమ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, రవి భిష్ణోయ్, మహ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లీస్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, సాహా, కేన్ విలియంసన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ 

Follow Us:
Download App:
  • android
  • ios