ఖ‌లీల్ అహ్మ‌ద్ వేసిన మూడో ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు బాదిన ఓపెనర్ పృథ్వీ షా (11; 8 బంతుల్లో 2x4).. అదే ఊపులో మ‌రో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఔట్ అయ్యాడు. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌కు అతడు క్యాచ్ ఇచ్చాడు. 

ఐపీఎల్ (IPL2021) 14వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad) కి ఓటమి ఎదురైంది. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ని ఎదుర్కోవడానికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో.. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw)ను సూపర్ క్యాచ్ తో ఔట్ చేశాడు.

అత్యంత తక్కువ స్కోర్ ని సన్ రైజర్స్ నమోదు చేయగా.. దానిని చేధించడానికి ఢిల్లీ రంగంలోకి దిగింది. అయితే.. 135 పరుగుల మోస్తరు ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఖ‌లీల్ అహ్మ‌ద్ వేసిన మూడో ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు బాదిన ఓపెనర్ పృథ్వీ షా (11; 8 బంతుల్లో 2x4).. అదే ఊపులో మ‌రో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి ఔట్ అయ్యాడు. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌కు అతడు క్యాచ్ ఇచ్చాడు. 

Scroll to load tweet…

కాగా.. ఈ క్యాచ్ ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. మ్యాచ్ ఓడినా.. విలియమ్సన్ మాత్రం ఈ క్యాచ్ తో ఆకట్టుకోవడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.