Asianet News TeluguAsianet News Telugu

IPL2021 DC vs RR: 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...

విఫలమైన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు... 7 పరుగులకే పెవిలియన్ చేరిన డేవిడ్ మిల్లర్... 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్...

IPL2021 DC vs RR: Rajasthan Royals lost three early wickets while chasing against delhi
Author
India, First Published Sep 25, 2021, 6:10 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశామనే ఆనందం, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లలో ఎక్కువసేపు నిలవలేదు. 155 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్, 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది...

3 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొదటి ఓవర్‌ ఆఖరి బంతికి తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్, ఆ తర్వాతి బంతికి జైస్వాల్ వికెట్ కోల్పోయింది...

4 బంతుల్లో 5 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, నోకియా బౌలింగ్‌లో పంత్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...  6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. 10 బంతుల్లో 7 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు.

17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్...  7 ఓవర్లు ముగిసేసరికి 28 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న సంజూ శాంసన్ చేసే పరుగులపైనే రాజస్థాన్ విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి... 

 

Follow Us:
Download App:
  • android
  • ios