Asianet News TeluguAsianet News Telugu

IPL2021 CSK vs SRH: మళ్లీ ఫెయిల్ అయిన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్... సీఎస్‌కే ముందు...

చెన్నై సూపర్ కింగ్స్ ముందు 135 పరుగుల టార్గెట్... 44 పరుగులు చేసిన సాహా, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్ మెరుపులు...

IPL2021 CSK vs SRH:  SunRisers Hyderabad failed to score decent total against Chennai
Author
India, First Published Sep 30, 2021, 9:13 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్యూర్ కొనసాగుతూనే ఉంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులకు పరిమితమైంది...

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 160+ టార్గెట్‌ను ఈజీగా ఛేదించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్, టేబుల్ టాపర్‌ సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో అలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోయారు.

గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన జాసన్ రాయ్, 7 బంతులాడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... ఆ తర్వాత కెప్టెన్ కేన్ విలియంసన్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...  

10 బంతుల్లో 7 పరుగులు చేసిన ప్రియమ్ గార్గ్ కూడా బ్రావో బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 44 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

ఆ తర్వాత అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ కలిసి ఐదో వికెట్‌కి 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, 14 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 18 పరుగులు చేసిన అబ్దుల్ సమద్‌లను ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు హజల్‌వుడ్...

5 పరుగులు చేసిన జాసన్ హోల్డర్ భారీ షాట్‌కి ప్రయత్నించి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. రషీద్ ఖాన్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

Follow Us:
Download App:
  • android
  • ios