62 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్... రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, అశ్విన్, నోకియాలకు చెరో వికెట్...
టేబుల్ టాపర్ పొజిషన్ కోసం జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి, చెన్నై సూపర్ కింగ్స్‌కి బ్యాటింగ్ అప్పగించాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్. సీజన్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న సీఎస్‌కే ఓపెనర్లు, ఆశించినట్టుగానే బౌండరీలతో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు...
ఇదీ చదవండి: IPL 2021: మమ్మల్ని తొక్కేస్తున్నారు సార్... ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ పరిస్థితిపై ట్రెండింగ్...
నోకియా వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే రుతురాజ్ గైక్వాడ్‌ను ఎల్బీడబ్ల్యూ అవుట్‌గా ప్రకటించాడు అంపైర్. అయితే రివ్యూ తీసుకున్న రుతురాజ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది. అయితే మూడో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చిన స్పిన్నర్ అక్షర్ పటేల్, డుప్లిసిస్‌ని అవుట్ చేశాడు...
8 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన డుప్లిసిస్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి నోకియా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
ఇదీ చదవండి: IPL 2021: రోహిత్ శర్మ ఇచ్చిన గిఫ్ట్ చూసి, భయపడిన రితికా... క్యూట్ వీడియో పోస్టు చేసిన ‘హిట్ మ్యాన్’...
ఐపీఎల్ 2021 సీజన్‌లో సీఎస్‌కే ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోరుకే అవుట్ కావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఫస్టాఫ్‌లో ఢిల్లీ క్యాపిటిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ 5 పరుగులు చేయగా, డుప్లిసిస్ డకౌట్ అయ్యాడు...
ఆ తర్వాత మొయిన్ ఆలీ 8 బంతుల్లో 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అయ్యర్‌కే క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసిన రాబిన్ ఊతప్పను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ చేర్చాడు... 9 ఓవర్లలో 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది చెన్నై సూపర్ కింగ్స్...
