Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీకి 12 లక్షల భారీ జరిమానా

కెఎల్‌ రాహుల్‌ సునామీని నిలువరించేందుకు, అప్పటికప్పుడు నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు విరాట్‌ కోహ్లి బౌలర్లతో శతవిధాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు ఫలించకపోగా.. మ్యాచ్‌ ఫీజులో రూ. 12 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది.

IPL2020 : Virat Kohli Fined 12 Lakhs For Slow Over Rate
Author
Dubai - United Arab Emirates, First Published Sep 25, 2020, 1:47 PM IST

పంజాబ్‌ నాయకుడు కెఎల్‌ రాహుల్‌ (132 నాటౌట్‌, 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లు) విశ్వరూపం ముందు మ్యాచ్‌తో పాటు మ్యాచ్‌ ఫీజునూ గల్లంతు చేసుకున్నాడు రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లి.  

గురువారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా బెంగళూర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి మ్యాచ్‌ రిఫరీ జరిమానా విధించాడు.  కెఎల్‌ రాహుల్‌ సునామీని నిలువరించేందుకు, అప్పటికప్పుడు నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు విరాట్‌ కోహ్లి బౌలర్లతో శతవిధాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు ఫలించకపోగా.. మ్యాచ్‌ ఫీజులో రూ. 12 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది.

ఐపీఎల్‌ 2020లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా విధించటం ఇదే తొలిసారి. కోడ్‌ ఆఫ్‌ కోడ్‌ కండక్ట్‌  ప్రకారం  ఇదే పరిస్థితి మళ్లీ పునరావృతం అయితే, కెప్టెన్‌ కోహ్లి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.  

గురువారం నాటి మ్యాచ్‌లో తొలుత పంజాబ్‌ 206/3 పరుగులు చేయగా.. ఛేదనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 109 పరుగులకే కుప్పకూలింది. 97 పరుగుల తేడాతో పంజాబ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విరాట్‌ కోహ్లి (1), జోశ్‌ ఫిలిప్‌ (0), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (1) విఫలమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios