Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్‌ వర్సెస్ ముంబై :హ్యాట్రిక్‌ వేటలో రోహిత్‌సేన:

రాజస్థాన్‌పై విజయంతో చెత్త రికార్డుకు చెరమగీతం, హాట్రిక్‌ విజయాలకు శ్రీకారం చుట్టాలని రోహిత్‌ గ్యాంగ్‌ భావిస్తోంది. ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ నేడు అబుదాబిలో రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.
 

IPL2020 : MI VS RR Match Preview, Fantasy Picks And Predictions, Pitch report, Other Stats
Author
Hyderabad, First Published Oct 6, 2020, 1:24 PM IST

డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ హాట్రిక్‌ విజయాల వేటలో ఉండగా... రాజస్థాన్‌ రాయల్స్‌ సీజన్‌లో హాట్రిక్‌ ఓటముల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది.  ముంబయి ఇండియన్స్‌తో ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించిన రాజస్థాన్‌ నేడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. 

రాజస్థాన్‌పై విజయంతో చెత్త రికార్డుకు చెరమగీతం, హాట్రిక్‌ విజయాలకు శ్రీకారం చుట్టాలని రోహిత్‌ గ్యాంగ్‌ భావిస్తోంది. ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ నేడు అబుదాబిలో రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.

ముంబయి ఇండియన్స్‌ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌ లైనప్‌లో క్వింటన్‌ డికాక్‌, రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ సహా హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్యలు ఫామ్‌లో ఉన్నారు. 

బౌలింగ్‌ విభాగంలో జేమ్స్‌ పాటన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రాలు కలిసికట్టుగా రాణిస్తున్నారు. స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌, కృనాల్‌లు సైతం అంచనాలు అందుకుంటున్నారు. అచ్చొచ్చిన అబుదాబిలో ముంబయి జోరును అడ్డుకోవటం అంత సులువు కాదు.

షార్జా నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌కు విజయమే దక్కలేదు. దుబాయ్‌, అబుదాబిలో వచ్చ రాగానే హిట్టింగ్‌కు వెళ్తున్న రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ అలవోకగా వికెట్లు కోల్పోతున్నారు. 

జోస్‌ బట్లర్‌ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. సంజు శాంసన్‌ తొలి రెండు మ్యాచుల తరహాలో చెలరేగితేనే.. రాజస్థాన్‌ మళ్లీ గెలుపు బాట పట్టేందుకు అవకాశం ఉంది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను నేడు ముంబయితో మ్యాచ్‌లో ప్రయోగించవచ్చు. జోఫ్రా ఆర్చర్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, శ్రేయస్‌ గోపాల్‌, టామ్‌ కరన్‌లతో కూడిన బౌలింగ్‌ విభాగం మెరుగ్గానే కనిపిస్తోంది.

వ్యూహంలో ఇవి కీలకం!

1. ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై సన్‌రైజర్స్‌ ఓ వ్యూహంతో విజయవంతమైంది. సందీప్‌ శర్మను రంగంలోకి దింపి రోహిత్‌ శర్మను ఆరు పరుగులకే వెనక్కి పంపారు. అంకిత్‌ రాజ్‌పుత్‌ను ఆడించి రోహిత్‌ను రాయల్స్‌ కట్టడి చేసే ఆలోచన చేయాలి. అంకిత్‌పై రోహిత్‌ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు వికెట్‌ కోల్పోయాడు. సగటు 3.50 కాగా,  స్ట్రైక్ ‌రేట్‌ 64  మాత్రమే.

2.  రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఆర్డర్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్ బట్లర్‌, స్టీవెన్‌ స్మిత్‌, సంజు శాంసన్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఆడుతున్నారు. అలా కాకుండా ఉతప్ప లేదా జైస్వాల్‌ను ఓపెనర్‌గా ఆడితే.. సంజు శాంసన్‌ను నాల్గో స్థానంలో ఆడించవచ్చు. శాంసన్‌ ఆఖర్లో ఉంటే రాజస్థాన్‌ డెత్‌ ఓవర్లలో పరుగులను పిండుకోవచ్చు. తొలి ముగ్గురు అవుటైతే.. కష్టాల్లో పడాల్సిన అవసరం అక్కర్లేదు.

3. అబుదాబిలో ఐపీఎల్ 2020 సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 168. కానీ ఇక్కడ విజయం సాధించాలంటే తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 183 పరుగులు చేయాలి.

4. 2019 ఐపీఎల్‌లో ఆఖరు ఐదు ఓవర్లలో బెస్ట్‌ బ్యాటింగ్‌ జట్టు ముంబయి ఇండియన్స్‌. ఆ జట్టు ఆఖరు ఐదు ఓవర్లలో 12.90.  ఈ సమయంలో ఓ వికెట్‌ను కనీసం 32.30 పరుగులకు గానీ వదులుకోదు.

5. ఐపీఎల్‌ 2020 పవర్‌ప్లేలో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌. తొలి నాలుగు మ్యాచుల్లో పవర్ ప్లేలో రెండే వికెట్లు కూల్చింది. ఎకానమి 8.50 కాగా, ప్రతి 4.70 బంతులకు ఓ బౌండరీ కోల్పోతుంది.

6. ముంబయి ఇండియన్స్‌పై అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌ ‌ స్టీవెన్‌ స్మిత్‌. ముంబయిపై 400 పైచిలుకు పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ స్మిత్‌. ముంబయిపై స్మిత్‌ స్ట్రైక్ ‌రేట్‌ 150 ప్లస్‌. మరే జట్టుపైనా స్మిత్‌కు ఈ గణాంకాలు లేవు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా):
ముంబయి ఇండియన్స్‌: క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, జేమ్స్‌ పాటిన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, రాహుల్‌ చాహర్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
రాజస్థాన్‌ రాయల్స్‌: జోశ్‌ బట్లర్‌ (వికెట్‌ కీపర్‌), స్టీవెన్‌ స్మిత్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్‌, రాబిన్‌ ఉతప్ప, రాహుల్ తెవాటియ, మహిపాల్‌ లామ్‌రార్‌, రియాన్‌ పరాగ్‌/అంకిత్‌ రాజ్‌పుత్‌, టామ్‌ కరన్‌, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, జైదేవ్‌ ఉనద్కత్‌.   

Follow Us:
Download App:
  • android
  • ios