Asianet News TeluguAsianet News Telugu

డబల్ హార్స్ మినప గుళ్ళు సహా సన్ రైజర్స్ స్పాన్సర్లు వీరే....

ఈ ఏడాది ప్రారంభంలో సిమెంట్‌ బ్రాండ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా సంతకం చేసి ఈ  నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్‌ కోసం ఫ్రాంచైజ్‌ నిలుపుకోగలిగింది. టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్నందున జేకే లక్ష్మి సిమెంట్‌ లోగోను జట్టు ఆటగాళ్ల ''జెర్సీ'' ముందు భాగంపై ముద్రిస్తారు. 

IPL2020 : List Of SRH Sponsors
Author
Hyderabad, First Published Sep 4, 2020, 9:02 AM IST

ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభమవనుంది. లోకల్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తి సన్నద్ధదతో రంగంలోకి దిగేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు. ఐపీఎల్‌ కోసం 13 మంది స్పాన్సర్‌లతో సంతకం చేసినట్టు గతంలోనే ప్రకటించిన సన్ రైజర్స్ ..... నిన్న స్పాన్సర్లను ట్వీట్ చేసింది. 

యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 2016 ఐపీఎల్‌ ఛాంపియన్లకు ప్రిన్సిపాల్‌ స్పాన్సర్ల శ్రేణిలో జేకే లక్ష్మి సిమెంట్‌ లిమిటెడ్‌ ముందున్నది. 

ఈ ఏడాది ప్రారంభంలో సిమెంట్‌ బ్రాండ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా సంతకం చేసి ఈ  నెలలో ప్రారంభమయ్యే టోర్నమెంట్‌ కోసం ఫ్రాంచైజ్‌ నిలుపుకోగలిగింది. టైటిల్‌ స్పాన్సర్‌గా ఉన్నందున జేకే లక్ష్మి సిమెంట్‌ లోగోను జట్టు ఆటగాళ్ల ''జెర్సీ'' ముందు భాగంపై ముద్రిస్తారు. 

రాల్కో టైర్లు, వాల్వోలిన్‌ ఇతర ప్రధాన స్పాన్సర్‌లు. వారి లోగోలు వరుసగా జెర్సీ ముందు వెనుక, కుడి ఎగువ ఛాతీపై ఉంటాయి. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ యాజమాన్యంలోని జియో, ఎలక్ట్రానిక్స్‌ సంస్థ టీసీఎల్‌ టెక్నాలజీ, ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫాం డ్రీమ్‌ 11, జై రాజ్‌ స్టీల్‌, కాన్సారు నెరోలాక్‌ పెయింట్స్‌ లిమిటెడ్‌, కోల్గెట్‌ కంపెనీలు ఐపీఎల్‌ సీజన్‌ 13 కోసం భాగస్వాములుగా సంతకం చేశాయి. 

వారి లోగోలు, బ్రాండింగ్‌లు జట్టు మ్యాచ్‌లో ప్రదర్శిస్తారు. స్పోర్ట్స్‌ ఎక్విప్‌మెంట్‌ బ్రాండ్‌ టైకా, ఫ్యాన్‌కోడ్‌, వర్చువల్‌ రియాలిటీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఐబీ క్రికెట్‌, ఫుడ్‌ బ్రాండ్‌ డబుల్‌ హార్స్‌ కూడా ఫ్రాంచైజీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. 

''కఠినమైన సమయాల్లో ఉన్నప్పటికీ స్పాన్సర్‌ల నుంచి ఆసక్తి చాలా సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉన్నది. మా భాగస్వాములకు అలుపెరుగని మద్దతు లభించినందుకు మేం గర్వంగా, కతజ్ఞతతో ఉన్నాం. ఇది జట్టుకు తమ ఉత్తమమైన ఆటను కొనసాగించడానికి స్ఫూర్తినిచ్చే అపారమైన మూలం'' అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కే షణ్ముగం చెప్పారు.

ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మాత్రం డబల్ హార్స్ మినపగుళ్ళు. ఈ సారి కూడా స్టామినా పార్టనర్ గా డబల్ హార్స్ మినపగుళ్ళు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios