Asianet News TeluguAsianet News Telugu

రెండో విజయం పై ధోని సేన కన్ను: స్టార్స్ లేక వీక్ గా రాజస్థాన్

విధ్వంసకర ఓపెనర్‌ జోస్‌ బట్లర్ కుటుంబంతో సహా ‌ యుఏఈకి చేరుకున్నా, పొడగించిన క్వారంటైన్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు తండ్రి క్యాన్సర్‌ బారిన పడటంతో పాకిస్థాన్‌తో సిరీస్‌ మధ్యలోనే న్యూజిలాండ్‌కు వెళ్లిన స్టార్‌ ఆల్‌రౌండర్‌  బెన్‌ స్టోక్స్‌ ఇంకా యుఏఈకి చేరుకోవాల్సి ఉంది. 

IPL2020 : CSK VS RR Match Preview, Probable Playing Eleven, pitch, Weather Report
Author
Sharjah - United Arab Emirates, First Published Sep 22, 2020, 11:17 AM IST

ఐపీఎల్‌ తొలి సీజన్‌ విజేత రాజస్థాన్‌ రాయల్స్‌ ఏండ్లుగా ఒకే సమస్యతో సతమతం అవుతోంది. తుది జట్టులో నలుగురు విదేశీ క్రికెటర్లను రాజీ పడుతూ బరిలోకి దింపాల్సి వస్తోంది. రాయల్స్‌ తొలి ఛాయిస్‌ విదేశీ క్రికెటర్లు అందుబాటులో లేకపోవటంతో స్మిత్‌ జట్టుకు ఈ పరిస్థితి తప్పటం లేదు. 

ఐపీఎల్‌ 2020 అందుకు భిన్నంగా సాగేలా కనిపించటం లేదు. విధ్వంసకర ఓపెనర్‌ జోస్‌ బట్లర్ కుటుంబంతో సహా ‌ యుఏఈకి చేరుకున్నా, పొడగించిన క్వారంటైన్‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు తండ్రి క్యాన్సర్‌ బారిన పడటంతో పాకిస్థాన్‌తో సిరీస్‌ మధ్యలోనే న్యూజిలాండ్‌కు వెళ్లిన స్టార్‌ ఆల్‌రౌండర్‌  బెన్‌ స్టోక్స్‌ ఇంకా యుఏఈకి చేరుకోవాల్సి ఉంది. 

ఈ ఇద్దరు లేకపోవటంతో రాయల్స్‌  తొలి మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోంది. బట్లర్‌, బెన్‌ లేని లోటును సొమ్ము చేసుకునేందుకు ధోనీసేన సిద్ధంగా ఉంది. నేడు షార్జా వేదికగా చెన్నై, రాజస్థాన్‌లు తలపడనున్నాయి.

జైస్వాల్‌ మెరిసేనా?...

ఏ స్థాయి క్రికెట్‌లో ఆడినా, అక్కడ తనదైన ముద్ర వేసిన యువ సంచలనం యశస్వి జైస్వాల్‌. ఈ ఏడాది వేలంలో రాజస్థాన్‌ ఈ కుర్రాడిని సొంతం చేసుకుంది. దూకుడు, సంయమనం కలగలిసిన జైస్వాల్‌ ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారనున్నాడు.  

రాబిన్‌ ఉతప్పతో కలిసి చెన్నైపై ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు.  ఐపీఎల్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడిన సంజు శాంసన్‌ ఈ సీజన్‌లోనూ దుమ్ము రేపేందుకు సిద్ధపడుతున్నాడు. 

మిడిల్‌ ఆర్డర్‌లో డెవిడ్‌ మిల్లర్‌ రాయల్స్‌ తరఫున తొలి మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఉన్నాడు. పంజాబ్‌కు 9 సీజన్లు ఆడిన మిల్లర్‌ ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఆడనున్నాడు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో కంకషన్‌కు గురైన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు.  

పేస్‌ బౌలర్లకు అనుకూలించే పిచ్‌పై జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కొవటం చెన్నైకి కష్టమైన పనే అని చెప్పాలి.  స్టోక్స్‌ స్థానంలో నేడు టామ్‌ కరన్‌ తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది.

విజయ్‌ నిలిచేనా..

ముంబయి ఇండియన్స్‌తో అత్యంత పేలవ ప్రదర్శన చేసిన మురళీ విజయ్‌పై నేటి మ్యాచ్‌లో వేటు పడే అవకాశం మెండు. రుతురాజ్‌ గైక్వాడ్‌ కోవిడ్‌19 నుంచి కోలుకుని జట్టుతో చేరాడు. ఓ పూర్తి స్థాయి ట్రైనింగ్‌ సెషన్‌ను సైతం పూర్తి చేసుకున్నాడు.  

సురేశ్‌ రైనా స్థానాన్ని భర్తీ చేయగల బ్యాట్స్‌మన్‌గా రుతురాజ్‌ను చెన్నై చూస్తోంది. రుతురాజ్‌కు మరింత ప్రాక్టీస్‌ అవసరం అనుకుంటే.. తుది జట్టులో చోటు కోసం నిరీక్షించాల్సి రావచ్చు. 

పేసర్లకు ఉపయోగపడే భారీ స్కోర్ల షార్జాలో అదనపు పేసర్‌ కావాలని అనుకుంటే విజయ్‌ స్థానంలో షార్దుల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి తీసుకునే వీలుంది. లుంగి ఎంగిడి స్థానంలో జోశ్‌ హెజిల్‌వుడ్‌ వచ్చేందుకు పిచ్‌ పరిస్థితులు ఉసిగొల్పుతున్నాయి.  

డుప్లెసిస్‌, అంబటి రాయుడు, సామ్‌ కరన్‌లు జోరు మీదున్నారు. కేదార్‌ జాదవ్‌, ఎం.ఎస్‌ ధోని, రవీంద్ర జడేజా తోడైతే సూపర్‌కింగ్స్‌కు వరుసగా రెండో విజయం లాంఛనమే.

షార్జా పేసర్ల అడ్డా..

బయో సెక్యూర్‌ బబుల్‌ ఐపీఎల్ మూడో వేదికకు చేరుకుంది. అబుదాబి, దుబాయ్‌లో తొలి మూడు రోజులు మ్యాచులు జరుగగా.. తాజాగా షార్జాకు ఫోకస్‌ షిఫ్ట్‌ అయ్యింది. అబుదాబి, దుబాయ్‌లు స్వల్ప స్కోర్లకు చిరుమానా అయితే, ఎమిరేట్స్‌లో భారీ స్కోర్లకు చిరునామా షార్జా. 

దీంతో ఐపీఎల్‌ 2020లో తొలిసారి 170 ప్లస్‌ స్కోరు అభిమానులు చూడబోతున్నారు. భారీ స్కోర్లతో పాటు ఇక్కడ వికెట్ల వేటలో పేసర్లదే పైచేయి. 2018 ఆరంభం నుంచి ఇక్కడ 67 శాతం వికెట్లు పేసర్లే తీసుకున్నారు. 

నిషేధం నుంచి తిరగొచ్చిన అనంతరం (2018 నుంచి) ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట చెన్నై పైచేయి సాధించింది. ఇప్పుడు ఆ సమీకరణాన్ని ఐదు మ్యాచుల్లో నాలుగుకు మెరుగుపర్చుకునేందుకు సూపర్‌కింగ్స్‌ రంగం సిద్ధం చేసుకుంది.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

రాజస్థాన్‌ రాయల్స్‌..  రాబిన్‌ ఉతప్ప, యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌, స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), డెవిడ్‌ మిల్లర్‌, రియాన్‌ పరాగ్‌, శ్రేయస్‌ గోపాల్‌, జోఫ్రా ఆర్చర్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, వరుణ్‌ అరోన్‌, టామ్‌ కరన్‌.

చెన్నై సూపర్‌కింగ్స్‌ ... షేన్‌ వాట్సన్‌, మురళీ విజయ్‌/రుతురాజ్‌ గైక్వాడ్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌, పియూశ్‌ చావ్లా, దీపక్‌ చాహర్‌, లుంగి ఎంగిడి/జోశ్‌ హెజిల్‌వుడ్‌.

Follow Us:
Download App:
  • android
  • ios