ఇండియన్ ప్రీమియర్ లీగ్...ఈ ఏడాది క్రికెట్ ప్రియులకు మజా పంచడానికి సిద్దమైంది. ఈ నెల 23న ప్రారంభమై దాదాపు రెండు నెలల పాటు ఐపిఎల్ ఫీవర్ తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఎప్పుడూ ఒక్కటిగా వుండే టీమిండియా అభిమానులు ఐపిఎల్ లో మాత్రం రాష్ట్రాలవారిగా విడిపోయి తమ తమ జట్లకు సపోర్ట్ చేస్తుంటారు. ఇలా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ గా చేయడానికి కూడా తెలుగు అభిమానులు సిద్దమయ్యారు. ఇలా తమ జట్టుకు మరోసారి టైటిల్ విజేతగా నిలిపేందుకు తమ వంతుగా సన్ రైజర్స్ ఆటగాళ్లను మైదానంలో సపోర్ట్ చేయడానికి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల అభిమానులు కూడా సిద్దమయ్యారు.  

ఈ మేరకు సన్ రైజర్స్ హోం గ్రౌండ్‌లో ఆడనున్న మ్యాచులపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది ఉప్పల్ స్టేడియంలో మొత్తం 7 మ్యాచులు జరగనున్నాయి. మొత్తంగా లీగ్ దశలో 14 ప్రతి జట్టు 14 మ్యాచులు ఆడుతుండగా హోంగ్రౌండ్ లో ఏడు, మిగతా చోట్ల ఏడు మ్యాచులు ఆడాల్సి వుంటుంది. ఈ నెల 29 తేదీన ఉప్పల్ మొదటి మ్యాచ్ జరగనుంది.  

ఇలా సన్ రైజర్స్ హోంగ్రౌండ్ అయిన  ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడే మ్యాచులను ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి వారికోసం ఉప్పల్ లో సన్ రైజర్స్ తలపడే మ్యాచుల వివరాలను కింద అందించడం జరిగింది. 

హైదరాబాద్ మ్యాచుల షెడ్యూల్  

 మార్చి 29: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-రాజస్తాన్‌ రాయల్స్‌ 

మార్చి 31: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(హైదరాబాద్‌)

ఏప్రిల్ 6:   సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-  ముంబై ఇండియన్స్‌

ఏప్రిల్ 14: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-  ఢిల్లీ కేపిటల్స్‌
 
ఏప్రిల్  17:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఏప్రిల్ 21: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌

ఏప్రిల్ 29: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ -   కింగ్స్‌  లెవెన్ పంజాబ్‌