IPL 2024: ఎక్కువ సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీం ఏదో తెలుసా? 2008 నుంచి 2023 వరకు విన్నర్స్ వీరే..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత్ లో నిర్వహించబడే అతిపెద్ద క్రికెట్ గేమ్ ఈవెంట్‌లలో ఒకటి. ఐపీఎల్ 2007లో బీసీసీఐ కమిటీచే స్థాపించబడింది. ప్రారంభంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ లలిత్ మోడీ.
Indian Premier League: ఐపీఎల్ 2024 సీజన్ కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఆటగాళ్ల వేలం పొట్టి క్రికెట్ సందడి షురూ అయింది. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ నెగ్గి ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ ను సాధించిన ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. గుజరాత్ టైటాన్స్ పై ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. అయితే, ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన లిస్టు లో ముంబయి, చెన్నై జట్టు సమంగా ఐదేసి సార్లు ఉన్నాయి.
ఐపీఎల్ ప్రారంభమైన 2007 ఎడిషన్ నుంచి 2023 వరకు టైటిల్ సాధించిన జట్ల వివరాలు గమనిస్తే..
సంవత్సరం |
ఐపీఎల్ విజేత |
సెకండ్ ప్లేస్ |
వేదిక |
2008 | రాజస్థాన్ రాయల్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | ముంబయి |
2009 | డెక్కన్ ఛార్జర్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | ముంబయి |
2010 | చెన్నై సూపర్ కింగ్స్ | ముంబై ఇండియన్స్ | జోహన్నెస్‌బర్గ్ |
2011 | చెన్నై సూపర్ కింగ్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | మంబయి |
2012 | కోల్‌కతా నైట్ రైడర్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | చెన్నై |
2013 | ముంబై ఇండియన్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | చెన్నై |
2014 | కోల్‌కతా నైట్ రైడర్స్ | కింగ్స్ XI పంజాబ్ | కోల్‌కతా |
2015 | ముంబై ఇండియన్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | బెంగళూరు |
2016 | సన్‌రైజర్స్ హైదరాబాద్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | కోల్‌కతా |
2017 | ముంబై ఇండియన్స్ | రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ | హైదరాబాద్ |
2018 | చెన్నై సూపర్ కింగ్స్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | ముంబయి |
2019 | ముంబై ఇండియన్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | హైదరాబాద్ |
2020 | ముంబై ఇండియన్స్ | ఢిల్లీ కాపిటల్స్ | దుబాయ్ |
2021 | చెన్నై సూపర్ కింగ్స్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | దుబాయ్ |
2022 | గుజరాత్ టైటాన్స్ | రాజస్థాన్ రాయల్స్ | అహ్మదాబాద్ |
2023 | చెన్నై సూపర్ కింగ్స్ | గుజరాత్ టైటాన్స్ | అహ్మదాబాద్ |