క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్‌లను సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరుగుతాయని తెలిపింది.

Also Read:బ్రేకింగ్: వరుస కరోనా కేసులు, ఐపీఎల్ నిరవధిక వాయిదా..!
పలు ఫ్రాంచైజీల్లోని ఆటగాళ్లు ఒక్కొక్కరిగా కోవిడ్ బారినపడటంతో బీసీసీఐ ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. అయితే ప్రస్తుత పరిస్ధితుల నేపథ్యంలో భారత్‌లో ఐపీఎల్ జరగదని బీసీసీఐ సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆయా బోర్డులు ఐపీఎల్ నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత యూఏఈకి బీసీసీఐ ఈ అవకాశం ఇచ్చింది.
అక్టోబర్ 10న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లు దుబాయ్ వెళ్లనున్నారు.