ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్... విదేశీ ఆటగాళ్లు లేకుండానే...

భారత్ లో కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం వీసా నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే... విదేశీ ఆటగాళ్లు లేకుండానే ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
 

IPL will not have foreign players till April 15 due to fresh visa restrictions

కరోనా వైరస్ రోజు రోజుకీ విభృంభిస్తుండటంతో... అసలు ఐపీఎల్ మ్యాచులు జరుగుతాయో లేదో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఐపీఎల్ మ్యాచులకు క్రేజ్ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అభిమానులు రూ.వేలు ఖర్చుపెట్టి టికెట్ కొని మరీ మ్యాచులు వీక్షించడానికి వెళతారు.

అయితే.. జనం అంత ఎక్కువ మంది వెళ్లడం వల్ల కరోనా మరింత వ్యాపించే అవకాశం ఉందని పలువురు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచులను నిలిపివేయాలంటూ కోర్టులకు ఎక్కినవారు కూడా ఉన్నారు. ఈ విషయమే ఇంకా తేలలేదు అనుకుంటే... ఈ ఐపీఎల్ సీజన్ కి మరో చిక్కు వచ్చి పడింది. 

భారత్ లో కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం వీసా నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే... విదేశీ ఆటగాళ్లు లేకుండానే ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఏప్రిల్ 15 వరకు భారత్ లో వీసా నిబంధనలు విధించారు. విదేశీయులు ఎవరూ మన దేశంలోకి అడుగుపెట్టడానికి వీలులేకుండా.. అంతేకాకుండా.. భారతీయులు కూడా ఇతర దేశాలకు వెళ్లకుండా కండిషన్స్ పెట్టారు.  కాగా... ఐపీఎల్ మ్యాచులు మాత్రం ఈ నెలాఖరుకే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 15 వరకు విదేశీ క్రికెటర్లు ఎవరూ తమ తమ జట్టులతో కలిసే అవకాశం కనపడటం లేదు.

Also Read క్రికెట్ పై కరోనా ఎఫెక్ట్...ఇక ఏ బౌలర్ అలా చేయడంటున్న భువీ...

ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. విదేశీ క్రికెటర్లు ఎవరూ బిజినెస్ వీసా కింద భారత్ లో ఏప్రిల్ 15కి ముందు అడుగుపెట్టలేరని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు.

దీంతో... ఐపీఎల్ అభిమానులు నిరాశకు గురౌతున్నారు. కనీసం ఏప్రిల్ 15 తర్వాతైనా జట్టులోకి చేరతారు అనడానికి కూడా పూర్తి గ్యారెంటీ లేదు. ఎందుకంటే... ఏప్రిల్ 15లోపు కరోనా వ్యాప్తి తగ్గుతుందనే గ్యారెంటీ లేదు. కాబట్టి.. ఆ తేదీని మరింత పొడిగించే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో.. ఐపీఎల్ అభిమానులు, సదరు జట్టు ఫ్రాంఛైజీలు నిరాశకు గురౌతున్నారు. మరి ఈ క్రికెటర్ల విషయంలో ప్రభుత్వం ఏదైనా సడలింపు ఇస్తుందేమో చూడాలి.

ఇదిలా ఉండగా భారత్ లో ఇప్పటి వరకు 60 కరోనా కేసులు గుర్తించారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా 3వేల మంది  ప్రాణాలు కోల్పోయారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios