IPL Teams Celebrates Holi: దేశమంతా జరుపుకుంటున్న రంగుల పండుగ హోళీని క్రికెటర్లు కూడా ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారు. ఐపీఎల్ సందర్భంగా వివిధ హోటళ్లలో ఉంటున్న ఆటగాళ్లంతా తమ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రంగుల పండుగ హోళీని దేశమంతా ఘనంగా జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు కూడా హోళీని తమదైన స్టైల్ లో జరుపుకుంటున్నారు. ఐపీఎల్ కోసం ఇప్పటికే వారికి కేటాయించిన హోటల్స్ కు చేరుకున్న పలువురు క్రికెటర్లు.. అక్కడే జట్టు సభ్యులతో కలిసి హోళీని జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ ఆనందంగా గడిపారు. ఐపీఎల్ లోని పది ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లు ఆనందోత్సహాలతో హోళీని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఐపీఎల్ లోని చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ లకు చెందిన ఆటగాళ్లు హోళీని ఘనంగా జరుపుకున్నారు.
ఐపీల్-15వ సీజన్ కు ఇంకా 8 రోజుల సమయమే ఉండటంతో ఆయా ఫ్రాంచైజీలన్నీ ఆటగాళ్లంతా ఒకరికొకరు సమన్వయమై.. గేమ్ మూడ్ లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. క్రికెటర్లతో పాటు తమ జట్టు అభిమానులను కూడా అలరించేందుకు వినూత్నమైన వీడియోలతో సోషల్ మీడియాలో అదరగొడుతున్నాయి. ఇందులో భాగంగానే ఫ్రాంచైజీలన్నీ హోళీ పండుగను పురస్కరించుకుని అందరినీ ఒక్కచోటకు చేర్చాయి.
ఐపీఎల్ లో కొత్త జట్టు హార్థిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్.. వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్, మహ్మద్ షమీ హార్థిక్ పాండ్యాలు అభిమానులకు హోళీ శుభాకాంక్షలు చెప్పారు.
ఇక గత కొద్దికాలంగా ట్విట్టర్ లో దూకుడుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ కూడా ఈసారి హోళీకి ప్రత్యేక వీడియోతో అభిమానుల ముందుకొచ్చింది. ఆ జట్టుకు చెందిన ఆటగాళ్లంతా హోళీని జరుపుకుంటున్న వీడియోను అభిమానులతో పంచుకుంది.
కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కూడా తమ ఆటగాళ్లు హోళీని జరుపుకుంటున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశాయి.
ఇదిలాఉండగా.. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్.. మిగతా 9 ఫ్రాంచైజీలకు హోళీ సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్ లను ఇచ్చింది. ముంబై రోడ్లలో బిల్ బోర్డులను ఏర్పాటు చేసి ఆయా ఫ్రాంచైజీలకు స్వాగతం పలికింది. 9 జట్లకు 9 రకాల స్లోగన్స్ ఇచ్చి ఫ్రాంచైజీలను ఉత్సాహపరిచింది. ముంబై జట్టు వివిధ జట్లకు ఇచ్చిన స్లోగన్స్ కింది విధంగా ఉన్నాయి. ముంబై ఇచ్చిన ఈ స్లోగన్స్ వెల్కమ్ అభిమానులను అలరిస్తున్నది.
రాజస్థాన్ రాయల్స్ : వెల్కమ్.. హల్లాబోల్.. దిల్ కోల్ కే
హైదరాబాద్ : వెల్కమ్.. షైన్ కరో.. దిల్ కోల్ కే
కోల్కతా : వెల్కమ్.. కోర్బో లోర్బో జీత్ బో దిల్ కోల్ కే
లక్నో : వెల్కమ్.. కేల్ నవాబీ.. దిల్ కోల్ కే
ఢిల్లీ : వెల్కమ్.. చక్ దే పత్తే.. దిల్ కోల్ కే
గుజరాత్ : వెల్కమ్.. మజా థీ రామ్జో.. దిల్ కోల్ కే
చెన్నై : వెల్కమ్.. విజిల్ పోడూ.. దిల్ కోల్ కే
బెంగళూరు : వెల్కమ్.. ప్లే బోల్డ్.. దిల్ కోల్ కే
పంజాబ్ : వెల్కమ్.. చక్ దే పట్టే.. దిల్ కోల్ కే
