Asianet News TeluguAsianet News Telugu

రాయల్స్ నుంచి ముంబైకి మలింగ! ఇటు నుంచి అటువైపుకి షేన్ బాండ్... ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు...

రాజస్థాన్ రాయల్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కి లసిత్ మలింగ... ముంబై ఇండియన్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కి షేన్ బాండ్... 

IPL 2024: Shane Bond appointed as bowling coach for Rajasthan Royals, Lasith Malinga CRA
Author
First Published Oct 23, 2023, 3:32 PM IST | Last Updated Oct 23, 2023, 3:32 PM IST

ఐపీఎల్ 2024 సీజన్‌ నెల ముందుగానే ప్రారంభం కానుంది. ఏప్రిల్- మే 2024 నెలలో దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. దీంతో ఫ్రిబవరి- మార్చి నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్‌లో ఐపీఎల్ 2024 వేలం జరగనుంది. తాజాగా సహాయక సిబ్బందిలో, కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు జరుగుతున్నాయి. గత రెండు సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన లసిత్ మలింగ, ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డాయి..

లసిత్ మలింగ, రాయల్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వస్తే.. ముంబై ఇండియన్స్ నుంచి షేన్ బాండ్, రాయల్స్‌లోకి వెళ్లబోతున్నాడు. గత 9 సీజన్లుగా ముంబై ఇండియన్స్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన షేన్ బాండ్‌ని, అసిస్టెంట్ కోచ్‌గా, బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంటున్నట్టు ప్రకటించింది రాజస్థాన్ రాయల్స్...

‘మోడ్రన్ డే క్రికెట్‌లో షేన్ బాండ్ గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. ఆయన అనుభవం, క్రికెట్ పరిజ్ఞానం, రాయల్స్‌కి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఐపీఎల్‌లో ఏడేళ్లుగా బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. మా జట్టును టైటిల్ విన్నింగ్ టీమ్‌గా మార్చడంలో ఆయన సేవలు ఉపయోగపడతాయని కోరుకుంటున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్, క్రికెట్ డైరెక్టర్ కుమార సంగర్కర...

ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ఎంఐ ఎమిరేట్స్‌కి హెడ్ కోచ్‌గా ఉన్న షేన్ బాండ్, ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకోబోతున్నాడు. మొదటి సీజన్‌లో క్వాలిఫైయర్ 2కి అర్హత సాధించిన ఎంఐ ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడింది.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios