RR vs SRH Qualifier2: IPL 2024 నుండి రాజస్థాన్ రాయల్స్ జట్టు నిష్క్రమించింది. ఈ సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. హైదరాబాద్ ఓటమికి కారణాలేమిటో తెలుసుకుందాం.. 

RR vs SRH Qualifier2: ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. ఈ సీజన్‌లోని రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయింది. తొలుత ఆడిన హైదరాబాద్ 175 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ జట్టు 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీజన్ తొలి అర్ధభాగంలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ మే నెలలో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓటమిని చవిచూడడానికి గల కారణాలేమిటో ఇప్పుడు చెప్పుకుందాం.

 టాప్ ఆర్డర్ విఫలం  

ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజూ శాంసన్, ర్యాన్ పరాగ్ అత్యధిక పరుగులు చేశారు. కానీ, ఈ డూ ఆర్ డై  మ్యాచ్‌లో మాత్రం వీరిద్దరూ విఫలమయ్యారు. సంజు 11 బంతుల్లో కేవలం 10 పరుగులు చేయగా.. పరాగ్ 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇలా ఈ ఇద్దరు కీలక బ్యాట్స్ మెన్ వైఫల్యం రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం.

 మంచు 

టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీనికి ప్రధాన కారణం మంచు. చెన్నైలో రెండో ఇన్నింగ్స్‌లో చాలా మంచు కురుస్తుంది. కానీ ఈ మ్యాచ్‌లో మంచు కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్‌ బౌలర్లు విభ్రుభించడంతో రాజస్థాన్‌ ఓడిపోయింది.


ఎలిమినేటర్ హీరో ఫెల్యూర్

ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ తన సొంతగడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కెప్టెన్ సంజు అతనికి కొత్త బంతిని అందించాడు. కానీ, అశ్విన్ అంతగా ఏమి రాణించలేదు. పైగా తన ఓవర్లలో వీరవిహారం చేశారు. 4 ఓవర్లు వేసిన ఆశ్విన్ 43 పరుగులు సమర్పించారు. 

పాట్ కమిన్స్ కెప్టెన్సీ అదుర్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలవడంలో పాట్ కమిన్స్ పాత్ర కీలకం. ఎవరూ ఊహించని విధంగా తన వ్యూహాన్ని అమలు పరిచారు. సరైన సమయంలో స్పిన్ బౌలర్లను రంగంలోకి దించారు. ఏ మాత్రం ఊహించని విధంగా ఈ సీజన్‌లో తొలిసారి అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అభిషేక్‌ ఇంపాక్ట్ ప్లేయర్‌గా మారారు. అభిషేక్ తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 24 పరుగులిచ్చి 2 పెద్ద వికెట్లు తీశాడు. అందులో సంజు శాంసన్ , షిమ్రాన్ హెట్మెయర్‌ లకు ఫెవియన్ పంపిచారు. కమిన్స్  ఇలాంటి వ్యూహాం అమలు చేస్తారని ఎవరూ ఊహించరు. 


టామ్ కోహ్లర్ కాడ్మోర్ పూర్తిగా విఫలం 

టామ్ కోహ్లర్-కాడ్మోర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేదు. అతను భారత్ లో ఎప్పుడూ ఆడలేదు. అయినా రాజస్థాన్ వేలంలో అతడిని కొనుగోలు చేసింది. బట్లర్ ఉపసంహరణ తర్వాత అతనికి అవకాశం లభించింది. కానీ, కాడ్మోర్ ఆ అవకాశాన్ని వినియోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలో వచ్చిన అతడు కేవలం 16 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు.