IPL 2024: ఢిల్లీ బౌలింగ్ ను రఫ్ఫాడించిన రియాన్ పరాగ్.. 3వ ఐపీఎల్ హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి.. !
RR vs DC : రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన మూడవ అర్ధ సెంచరీని కొట్టి ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. తన ధనాధన్ ఇన్నింగ్స్ తో రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు.
Ryan Parag : జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆల్-రౌండర్ రియాన్ పరాగ్ ఐపీఎల్ లో తన మూడో హాఫ్ సెంచరిని కొట్టి ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. ఢిల్లీతో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పరాగ్ ఈ మ్యాచ్ తో ఢిల్లీ బౌలింగ్ ను రఫ్ఫాడించాడు. 45 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పరాగ్ ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాజస్థాన్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు, లక్నోతో జరిగిన మొదటి మ్యాచ్‌లో రియాన్ పరాగ్ 43 పరుగులు చేశాడు. అస్సాం ఆల్‌రౌండర్ ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ కు ముందు దేశవాళీ క్రికెట్ లో బ్యాట్ తో అదరగొట్టాడు.
పరాగ్ 45 బంతుల్లో ఏడు బౌండరీలు, ఆరు సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో ఇది పరాగ్ అత్యధిక స్కోరు. అలాగే, ఇది అతన్ని ఐపీఎల్ 2024లో టాప్-త్రీ రన్-స్కోరర్‌లలోకి తీసుకువెళ్లింది. ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన లిస్టులో హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ (143 పరుగులు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. పరాగ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 171.62 స్ట్రైక్ రేట్‌తో 127 పరుగులు చేశాడు. 84 పరుగుల తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఉద్వేగానికి గురయ్యాడు. తన నాక్ చాలా ప్రాక్టీస్ ఫలితమని చెప్పాడు. ఈ ఇన్నింగ్స్ తో ఇప్పుడు ఐపీఎల్‌లో 56 మ్యాచ్‌లలో 727 పరుగులు చేశాడు. ఇది మూడో హాఫ్ సెంచరీ.
కాగా, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. మరోసారి యశస్వి జైస్వాల్ నిరాశపరిచాడు. రియాన్ పరాగ్ 84, అశ్విన్ 29 పరుగులు చేశారు. 186 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 12 పరుగులతో ఢిల్లీ ఓటమిపాలైంది. ట్రిస్టన్ స్టబ్స్ 44 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు కానీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.
హనుమ విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి షోకాజ్ నోటీసులు