Asianet News TeluguAsianet News Telugu

Hardik Pandya : ఊహాగానాలకు తెర .. ముంబైకి కాదు, గుజరాత్‌తోనే హార్డిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన టైటాన్స్

డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టులో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. హార్డిక్ పాండ్యా 2022 ఐపీఎల్‌లో .. అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు. 

IPL 2024 Retention: Hardik Pandya retained by Gujarat Titans amid rumours of switching to Mumbai Indians ksp
Author
First Published Nov 26, 2023, 6:37 PM IST

డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టులో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో పాండ్యా ఫ్రాంచైజీని మార్చుకుని ముంబై ఇండియన్స్‌కు తిరిగి వస్తాడనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ (GT) సారథిగా వున్న హార్డిక్ పాండ్యా 2015లో అతనికి మొదటి విరామం ఇచ్చిన జట్టు (ముంబై ఇండియన్స్)లోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందుకు ముంబై .. బహిర్గతం చేయని బదిలీ రుసుముతో పాటు రూ. 15 కోట్లు చెల్లించవలసి ఉంది. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో నివేదిక ప్రకారం పాండ్యాను గుజరాత్ వదులుకోకూడదని నిర్ణయించింది.

హార్డిక్ పాండ్యా 2022 ఐపీఎల్‌లో .. అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌‌లో గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. గుజరాత్‌ టైటాన్స్‌లో చేరడానికి ముందు పాండ్యా.. ముంబై ఇండియన్స్ తరపున ఏడు సీజన్‌లలో ఆడాడు. 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో అతను సభ్యుడు. 

2021లో గుజరాత్ టైటాన్స్‌ ఐపీఎల్‌లో చేరిన సమయంలో దాని యజమానులైన సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్‌కు తమకు నచ్చిన ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవడానికి అనుమతి పొందారు. ఆ సమయంలో పాండ్యా (రూ.15 కోట్లు), రషీద్ ఖాన్ (రూ.15 కోట్లు), శుభ్‌మన్ గిల్ (రూ.7 కోట్లు)ను గుజరాత్ చేజిక్కించుకుంది. గతంలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌లకు నాయకత్వం వహించిన రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానేలు 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లారు. కాగా.. ఏ ఏ ఆటగాళ్లను కొనసాగించాలనుకుంటున్నారో, ఎవరిని రిలీజ్ చేయదలచుకుంటున్నారో తెలియజేసేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆదివారమే లాస్ట్ డేట్. 

తొలుత హార్డిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకొచ్చేందుకు , డిసెంబర్ 19న జరగనున్న వేలం కోసం పర్సును పెంచుకునేందుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేయాలని భావించింది. గతంలో ఐపీఎల్ మినీ వేలంలో గ్రీన్‌ను రూ.17.5 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. అనంతరం 2022లో మెగా వేలంలో ఆర్చర్‌ను రూ.8 కోట్లకు చేజిక్కించుకుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios