Delhi Capitals Women vs UP Warriorz: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (డ‌బ్ల్యూపీఎల్ 2024) లో మ‌రో థ్రిల్లింగ్ గేమ్ న‌రాలు తెగే ఉత్కంఠ‌ను రేపింది. ఆఖ‌రి ఓవ‌ర్ లో చివ‌రి 4 బంతుల్లో 2 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో హ్యాట్రిక్.. ఒక్క ప‌రుగుతో ఢిల్లీ క్యాపిటల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ సాధించింది యూపీ వారియ‌ర్స్.  

Womens Premier League 2024: మహిళ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 (డ‌బ్ల్యూపీఎల్ 2024) మ‌రో న‌రాలు తెగే ఉత్కంఠ‌ను రేపిన మ్యాచ్ జ‌రిగింది. ఆఖ‌రు ఓవ‌ర్ లో అద్భుత‌మైన ఆట‌తో తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య యూపీ వారియ‌ర్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ సాధించింది. 15వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మహిళల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ మహిళలు తొలుత బ్యాటింగ్ చేశారు. అయితే, యూపీకి మంచి శుభారంభం ల‌భించ‌లేదు. ఓపెనర్ కిరణ్ నవ్‌గ్రే 5 పరుగులు, కెప్టెన్ అలిస్సా హీలీ 29 పరుగులు చేసి ఔటయ్యాడు. తహిలా మెహ్రాద్ 3, గ్రేస్ హారిస్ 14, శ్వేతా షెరావత్ 4, పూనమ్ గామ్నర్ 1, షోఫీ ఎక్లెస్టోన్ 8 స్వల్ప పరుగులకే ఔటయ్యారు. దీప్తి శర్మ మాత్రమే చివరి వరకు ఆడి 59 పరుగులు చేసి ఔటైంది. 20 ఓవ‌ర్ల‌లో 138/8 ప‌రుగులు చేసింది.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ల‌లో టైటస్ సాధు, రాధా యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. షికా పాండే, అరుంధతీ రాయ్, జెస్ జొనాసెన్, అలీస్ క్యాప్సీ తలా ఒక వికెట్ తీశారు. 139 పరుగుల స్వ‌ల్ప‌ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన‌ ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ షఫాలీ వర్మ 15 పరుగుల వద్ద ఔటయ్యారు. అలిస్ క్యాప్సీ 15, జెమీమా రోడ్రిగ్స్ 17, అన్నాబెల్లె సదర్లాండ్ 6 వరుసగా ఔటయ్యారు. ఓ వైపు దూకుడుగా ఆడిన మెగ్ లానింగ్ 46 బంతుల్లో 12 ఫోర్లతో 60 పరుగులు చేసింది. అయితే, అరుంధతి రెడ్డి 0, శిఖా పాండే 4 వరుసగా వికెట్లు కోల్పోయి గెలుపు ముంగిట ఆగ‌పోయారు. చివరి 2 ఓవర్లలో 15 పరుగులు అవ‌స‌రమైన స‌మ‌యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. చివరకు 2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి యూపీ వారియర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

INDIA VS ENGLAND: 15 ఏండ్ల త‌ర్వాత భార‌త్ అరుదైన రికార్డు..

18వ ఓవర్ లో 3 వికెట్లు కోల్పోయి 5 పరుగులు చేసింది ఢిల్లీ. చివరి 6 బంతుల్లో 10 పరుగులు కావాలి. ఇందులో రాధా యాదవ్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచి 2వ బంతికి 2 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి చివరి 4 బంతుల్లో 2 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, చివరి ఓవర్‌లో గ్రేస్ హారిస్ హ్యాట్రిక్ తో ఢిల్లీ గెలుపు అడ్డుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసి ఒక పరుగు తేడాతో ఓడిపోయింది.

యూపీ వారియ‌ర్స్ బౌలింగ్ విషయానికొస్తే దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టింది. సైమా ఠాగూర్, గ్రేస్ హారిస్ చెరో 2 వికెట్లు తీశారు. షోబీ ఎక్లెస్టోన్ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఓటమి కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరేది. యూపీ వారియర్స్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొన‌సాగుతోంది. 

India vs England: కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డు.. !

Scroll to load tweet…

Ind vs Eng: 112 ఏళ్ల తర్వాత.. స‌రికొత్త‌ చరిత్ర సృష్టించ‌నున్న రోహిత్ సేన !