Asianet News TeluguAsianet News Telugu

IPL 2024: రెండు గంటల్లో ఏం జరిగిందో..  సొంత గూటికి చేరిన హార్దిక్‌ పాండ్యా..

IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే భారీ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హార్ధిక్‌ను రిటైన్‌ చేసుకున్నామని గుజరాత్‌ టైటాన్స్‌ ప్రకటించిన రెండు గంటల్లోపే ముంబై ఇండియన్స్‌ తాము హార్దిక్‌ను తిరిగి దక్కించుకున్నామని వెల్లడించింది. హార్దిక్‌ను ముంబై ఇండియన్స్‌ ట్రేడింగ్‌ ద్వారా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. దీంతో గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టుతో బంధాన్ని తెంచుకున్నాడు.  

IPL 2024  Hardik Pandya traded to Mumbai Indians in all-cash deal KRJ
Author
First Published Nov 27, 2023, 2:33 AM IST

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 సీజన్‌కు సంబంధించి ఈ ఆదివారం (నవంబర్ 26) చాలా ప్రత్యేకమైన రోజు. అదే రోజు మొత్తం 10 జట్లు తమ ఆటగాళ్లను రిటైన్ చేసి జాబితాను విడుదల చేశాయి. ఇందులో అనేక షాకింగ్ నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ ట్రాన్స్‌ఫర్ కనిపించింది. గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టుతో బంధాన్ని తెంచుకున్నాడు. తిరిగి అతను తన పాత జట్టు ముంబై ఇండియన్స్ (MI)కి వచ్చాడు. ముంబై భారీ ట్రేడ్ ద్వారా పాండ్యాను జట్టులోకి తీసుకుంది. 

వాస్తవానికి హార్ధిక్‌ పాండ్యాను రిటైన్‌ చేసుకున్నామని గుజరాత్‌ టైటాన్స్‌ ప్రకటించి జట్టును ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన రెండు గంటల్లోపే ముంబై ఇండియన్స్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తాము హార్దిక్‌ను తిరిగి దక్కించుకున్నామని వెల్లడించింది.

హార్దిక్‌ను ముంబై ఇండియన్స్‌ భారీ ట్రేడింగ్‌ ద్వారా దక్కించుకున్నట్లు తెలుస్తుంది. హార్దిక్‌ను దక్కించుకోవడానికి ముంబై ఇండియన్స్ మెనేజ్ మెంట్  గుజరాత్‌ ఫ్రాంచైజీకి భారీ మొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది. హార్దిక్‌కు ఇచ్చే 15 కోట్లతో (ప్రతి సీజన్‌ లో హార్ధిక్‌ పాండ్యాకు గుజరాత్‌ టైటాన్స్ చెల్లించే మొత్తం) పాటు అతని విడుదల కోసం భారీ మొత్తాన్ని ముంబై యాజమాన్యం గుజరాత్‌ టైటన్స్ కు  చెల్లించనట్టు టాక్. 


గుజరాత్‌ టైటన్స్‌కు రాకముందు హార్దిక్‌ పాండ్యా ఆరేళ్ల పాటు(2015 - 2021) ముంబై ఇండియన్స్‌ తరుపున ఆడారు. కానీ, 2022లో తొలిసారి గుజరాత్ టైటన్స్ అనే జట్టు ఐపీఎల్ లోకి ఎంట్రీ అయ్యింది. ఈ జట్టు కెప్టెన్సీని హార్దిక్‌ పాండ్యా చేతుల్లో పెట్టగా.. ఆ జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అనంతరం 2023 సీజన్‌లో హార్దిక్‌ నేతృత్వంలో గుజరాత్‌ రన్నరప్‌గా నిలిచింది.

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తం 123 మ్యాచ్‌లు ఆడాడు. 115 ఇన్నింగ్స్‌లలో 2309 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 10 అర్ధ సెంచరీలు చేశాడు. అదే సమయంలో పాండ్యా  81 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి 53 వికెట్లు పడగొట్టాడు. 17 పరుగులకే 3 వికెట్లు పడగొట్టడం అతని బెస్ట్ ఫార్మెన్స్.  హార్దిక్‌ తిరిగి ముంబై గూటిలో చేరడం పట్ల ముంబై ఇండియన్స్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios