IPL 2024 : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్... ఐపిఎల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది...
ఐపిఎల్ 2024 పై సందిగ్దత వీడింది. లోక్ సభ ఎన్నకల నేపథ్యంలో ఐపిఎల్ ను విదేశాలకు తరలిస్తారన్న ప్రచారంపై బిసిసిఐ క్లారిటీ ఇచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్... పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ స్వరూపాన్నే టీ20 ఫార్మాట్ మార్చేస్తే... దీన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది ఐపిఎల్. ప్రస్తుతం ఐపిఎల్ 2024 రసవత్తరంగా సాగుతున్న వేళ ఓ ప్రచారం క్రికెట్ ప్రియులను కలవరపెట్టింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఐపిఎల్ విదేశాల్లో నిర్వహించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ బిసిసిఐ తాజా ప్రకటన ఐపిఎల్ ప్రియుల ఆందోళనను దూరం చేసింది.
ఐపిఎల్ 2024 మొత్తం భారత్ లోనే కొనసాగుతుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ తేల్చింది. ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరోవైపు ఐపిఎల్ మ్యాచులు జరుగుతాయని తేల్చింది. కేంద్ర ప్రభుత్వం ఐపిఎల్ నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు చెప్పలేదని... అందువల్లే మొత్తం 774 మ్యాచులను స్వదేశంలోనే నిర్వహించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.
ఇప్పటికే ఐపిఎల్ 2024 టోర్నీ ప్రారంభమయ్యింది. అయితే ఐపిఎల్ నిర్వహణపై సందిగ్దత కొనసాగడంతో బిసిసిఐ కొన్ని మ్యాచుల షెడ్యూల్ ను మాత్రమే ప్రకటించింది. ఇటీవలే ప్రారంభమైన టోర్నీ కేవలం ఏప్రిల్ 7 వరకే కొనసాగనుందని మొదట ప్రకటించింది. తాజాగా రెండో దశ షెడ్యూల్ ను కూడా ఇండియాలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 8 నుండి యధావిధిగా ఐపిఎల్ కొనసాగుతుందని బిసిసిఐ ప్రకటించింది.
మార్చిలో ప్రారంభమైన ఐపిఎల్ 2024 ఏప్రిల్ నెలమొత్తం కొనసాగనుంది. మే 21న తొలి క్వాలిఫయర్ మ్యాచ్, మే 22 న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనున్నాయి. ఇక చెన్నై చెపాక్ స్టేడియంలో మే 26న ఐపిఎల్ ఫైనల్ జరగనుంది.