IPL 2024 : ఆ ఆటగాడ్ని అంటిపెట్టుకుని.. షారుక్ ఖాన్ కు గుడ్ బై చెప్పిన ప్రీతి జింటా

Punjab Kings Release list: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు శామ్ కుర్రాన్‌ను పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకున్న పంజాబ్ కింగ్స్ షారుక్ ఖాన్ సహా ఐదుగురు ఆటగాళ్లను ఉద్వాసన పలికింది. విడుదలైన, నిలుపుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదిగో.. 

IPL 2024 Full list of players retained and released by Punjab Kings KRJ

Punjab Kings Release list: IPL 2024 వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేయబడిన, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను BCCIకి సమర్పించాయి. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ తన జట్టు ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. గతేడాది రాణించిన ఆటగాళ్లందర్నీ పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.  అదే సమయంలో అనుకున్న స్తాయిలో ప్రదర్శన కనబరచని  ఐదుగురు ఆటగాళ్లను వీడ్కోలు పలికింది.

ఈ ఐదుగురు ఆటగాళ్లలో కాస్లీ ప్లేయర్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఫినిషర్  షారుఖ్ ఖాన్ ఒక్కడే. అతడ్ని  రూ. 9 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ, గత సీజన్‌లో షారూఖ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. 2023 IPL సీజన్‌లో షారుక్ ఖాన్ 14 మ్యాచ్‌లలో 156 పరుగులు చేసాడు, అందులో అతని అత్యధిక స్కోరు 41 నాటౌట్. 2022లో షారుక్ 8 మ్యాచ్‌ల్లో 117 పరుగులు, 2021లో 11 మ్యాచ్‌ల్లో 153 పరుగులు చేశాడు. ఇలా వైఫల్యాలను ద్రుష్టిలో పెట్టుకుని ఈ సారి అతనికి ఉద్వాసన పలికింది ప్రితీజింటా..  
 
వాస్తవానికి IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కుర్రాన్‌ను ప్రీతిజింటా వదిలేస్తుందని ప్రచారం జరిగింది. కానీ,  అతనిపై నమ్మకం పెట్టుకున్న ప్రీతి జింటా.. మరోసారి అతనికి అవకాశం కల్పించింది.  2023 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు వేలం వేయడం ద్వారా సామ్‌ను చేర్చుకుంది.  గతసీజన్లో సామ్ కర్రాన్ అంతగా రాణించలేకపోయాడు. అతను ఆడిన 14 మ్యాచ్‌ల్లో 276 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో మొత్తం 10 వికెట్లు తీసుకున్నాడు. అటువంటి పరిస్థితిలో, సామ్ కుర్రాన్ మరోసారి IPL 2024లో పంజాబ్ కింగ్స్ జెర్సీలో ఆడేందుకు అవకాశం అందించింది పంజాబ్ కింగ్ప్. అదే సమయంలో శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, జితీశ్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ కరణ్, సికిందర్ రాజా, లివింగ్ స్టోన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడా వంటి  ప్రధాన ఆటగాళ్లందర్నీ రిటైన్ చేసుకుంది .

  
 పంజాబ్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్ల జాబితా:

 భానుక రాజపక్సే, మోహిత్ రాఠి, బల్తేజ్ ధండా, రాజ్ అంగద్ బావా, షారుక్ ఖాన్ పేర్లు ఉన్నాయి.

పంజాబ్ కింగ్స్‌లో రిటైన్ చేయబడిన ఆటగాళ్లు: 

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ భాటియా, జితేష్ శర్మ, శివమ్ సింగ్, అథర్వ తైడే, సికందర్ రజా, రిషి ధావన్, హర్‌ప్రీత్ బ్రార్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, రాహుల్ చహర్ రబాడ, అర్ష్దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, విధ్వత్ కవేరప్ప.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios