IPL 2024 Auction : గెరాల్డ్ కోట్జీని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్.. ఎన్ని కోట్లు అంటే ?
దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోట్జీని ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది. అతడిని రూ. 5 కోట్లకు కొనుక్కున్నది. ఈ ఫేసర్ కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్ (IPL 2024).
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోట్జీని ముంబై ఇండియన్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో కోట్జీకి ఇదే తొలి సీజన్ కావడం విశేషం. భారత్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్ కు చేరిన సమయంలో ఎనిమిది మ్యాచ్ ల్లో 20 వికెట్లు పడగొట్టాడు.
టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా కోట్టీ నిలిచాడు. అతడు ఇప్పటికే ఎస్ఏ 20, మేజర్ లీగ్ క్రికెట్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వేగంగా బౌలింగ్ చేయగల కోట్జీ సామర్థ్యం అతడికి ఎంతో విలువ తీసుకొచ్చింది. ఇటీవల భారత్ తో జరిగిన రెండో టీ20లో 3/32తో ఆకట్టుకున్న ఈ 23 ఏళ్ల పేసర్ జట్టు విజయానికి దోహదపడ్డాడు.
లిస్ట్ ఏ క్రికెట్ లోనూ కోట్జీ తన బ్యాటింగ్ పటిమను చూపించాడు. ఇటీవల పల్లెకెలెలో శ్రీలంక-ఏ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా-ఏ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు.7 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 89 బంతుల్లో 77 పరుగులు చేశాడు. దిల్షాన్ మదుశంక, దునిత్ వెల్లగే, లక్షన్ సందకన్లతో కూడిన ఛాలెంజింగ్ బౌలింగ్ అటాక్ పై ఈ చెప్పుకోదగ్గ ప్రదర్శన జరిగింది.