IPL 2024 Auction LIVE: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్, వదులుకున్న ప్లేయర్స్.. కళ్లన్నీ కావ్యామారన్ పైనే.. !
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2024 ప్లేయర్స్ వేలంలో ఆరుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనుంది. వీరిలో ముగ్గురు విదేశీ ప్లేయర్లు ఉంటారు. హైదరాబాద్ టీమ్ మనీ పర్స్‌లో రూ. 34 కోట్లు ఉన్నాయి.
IPL 2024 Auction LIVE: ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.34 కోట్లతో వేలంలోకి ప్రవేశించనుంది. లెఫ్టార్మ్ ఆఫ్ స్పిన్నర్ మయాంక్ డాగర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన షాబాజ్ అహ్మద్ ను సన్‌రైజర్స్ ఇప్పటికే కొనుగోలు చేసింది. ఐడెన్ మక్రమ్ నేతృత్వంలోని జట్టు తమ ఆటగాళ్లలో ఎక్కువ మందిని రిటైన్ చేసుకుంది, కానీ హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్ తో సహా కొంతమందిని మాత్రమే విడుదల చేసింది. వీరికి ఆరు స్లాట్లు ఉండగా, అందులో ముగ్గురు విదేశీయులు ఉండాలి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో 2016లో మొదటి, ఏకైక ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పటి నుండి టైటిల్ పోరులో ఉండటానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చాలా మంది కెప్టెన్లను మార్చింది. అయితే, ఫలితాలను రాబట్టడంలో వెనుకబడింది. వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ స్థానంలో మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్‌ని తీసుకున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నాడు. అయితే, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎదేమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ జట్టు విజయాలు, ఓటములతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఐపీఎల్ సమయంలో వైరల్ అవుతుంటారు. వేలం జరిగిన ప్రతిసారి ట్రోల్ పేలుతుంటాయి. జట్టును నిర్మించడంలో పెద్దగా దృష్టిపెట్టరనే అభిప్రయం నెటిజన్ల నుంచి వ్యక్తమవుతుంటుంది. మరి ఈ సారి ఏం చేస్తారో చూడాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు గ్లెన్ ఫిలిప్స్, మక్రం, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ రూపంలో స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్లేయర్లతో బలమైన జట్టుగా ఉంది. ఈ వేలంలో తమ సామర్థ్యాలకు అనుగుణంగా ఖాళీలను పూరించడానికి ప్రయత్నించే అవకాశముంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసిన ఆటగాళ్లు: ఐడెన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ (ఆర్సీబీ నుంచి ట్రేడ్ చేశారు), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, ఫజహక్ ఫరూఖీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసిన ఆటగాళ్లు: హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తీక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకేల్ హోసేన్, ఆదిల్ రషీద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీ పర్స్ : రూ. 34 కోట్లు
స్లాట్‌లు ఎన్ని మిగిలి ఉన్నాయి: 6 (3 విదేశీ ఆటగాళ్ళు, ముగ్గురు భారత ప్లేయర్లు)
- 2024 IPL Auction
- Aiden Markram
- BCCI
- Cricket
- Cricket News
- Dubai
- Harry Brook
- IPL
- IPL 2024
- IPL 2024 AUCTION
- IPL 2024 Auction
- IPL 2024 Auction LIVE
- IPL 2024 Auction LIVE updates
- IPL Auction
- IPL Auction 2024
- Indian Premier League
- Kaviya Maran
- SRH
- SRH Auction streaming
- SRH Captain
- SRH Full squad
- SRH Released players
- SRH Remaining purse
- SRH Retained players
- SRH Squad
- SRH Squad live
- SRH in IPL 2024 Auction
- Sunrisers Hyderabad
- Sunrisers Hyderabad in IPL Auction 2024
- Sunrisers Hyderabad live
- Sunrisers Hyderabad live updates
- Sunrisers Hyderabad players bought
- Sunrisers Hyderabad schedule
- india cricket
- ipl 2024
- list of players Sunrisers Hyderabad bought in IPL
- washington sundar