డిసెంబర్ 19న దుబాయ్‌లో ఐపీఎల్ 2024 వేలం.. నవంబర్ 26లోగా అన్ని జట్లకు డెడ్‌లైన్...
డిసెంబర్ 19న దుబాయ్‌లో ఐపీఎల్ 2024 వేలం... రిటైన్ చేసుకున్న ప్లేయర్ల జాబితాను వెల్లడించేందుకు నవంబర్ 26 వరకూ అవకాశం..
అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఐపీఎల్ 2023 వేలాన్ని కొచ్చి వేదికగా నిర్వహించిన ఐపీఎల్ మేనేజ్‌మెంట్, ఈసారి దుబాయ్ వేదికగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
నవంబర్ 26లోగా ప్రతీ ఫ్రాంఛైజీ, రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్ల వివరాలను, వేలానికి వదిలేసిన ప్లేయర్లను వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ రూ.100 కోట్ల పర్సు వాల్యూతో వేలంలో పాల్గొనబోతున్నాయి. గతంలో ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ రూ.95 కోట్లు ఉండగా ఈసారి రూ.5 కోట్లు పెరిగింది.
2024, జూన్ 4 నుంచి జూన్ 30 వరకూ యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగబోతోంది. ఇప్పటికే ఐసీసీ షెడ్యూల్ కూడా కన్ఫార్మ్ అయిపోయింది..
2024 ఏప్రిల్- మే మధ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఐపీఎల్ 2024 టోర్నీని ఇండియాలో నిర్వహించాలంటే, మార్చి నెలలోనే జరపాల్సి ఉంటుంది.. దీనిపై డిసెంబర్‌లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2024 వేలంలో ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్, క్రిస్ వోక్స్, సామ్ బిల్లింగ్స్, జోష్ హజల్‌వుడ్ తదితర స్టార్ ప్లేయర్లు పాల్గొనబోతున్నారు.