IPL 2024 : బెన్ స్టోక్స్ కు సీఎస్కే షాక్.. IPL 2024 ఆడనున్న కూల్ కెప్టెన్ ధోనీ.. ఆటగాళ్ల జాబితా ఇదే!
Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో మొత్తం 10 జట్లలో తాము రిటైన్ చేసిన, వీడుక్కోలు పలికిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించింది
Chennai Super Kings: ప్రతిష్టాత్మక ICC ODI ప్రపంచ కప్ 2023 ముగిసింది. నవంబర్ 19న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులు ఈ ఓటమిని మరిచిపోయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం ఎదురుచూడడం ప్రారంభించారు. ఈ ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. అయితే దీనికి ముందు, చివరి తేదీ (నవంబర్ 26)కి ముందు మొత్తం 10 జట్లు రిటైన్ చేయబడిన మరియు విడుదలైన ఆటగాళ్ల జాబితా ను విడుదల చేశాయి. మొత్తం 10 జట్ల నుంచి మొత్తం 89 మంది ఆటగాళ్లు విడుదలయ్యారు.
ముందుగా, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గురించి మాట్లాడుకుంటే.. ఇది తన రిటైన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించింది. వారు బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, అంబటి రాయుడు, సిసంద మగల, కైల్ జేమ్సన్, భగత్ వర్మ, సేనాపతి, ఆకాష్ సింగ్‌లను వంటి 8 ఆటగాళ్లకు గుడ్ బై చెప్పింది సీఎస్కే. ఎల్లో టీంకు శుభవార్త ఏంటంటే.. రానున్న సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బరిలోకి దిగుతాడని చెన్నై సూపర్ కింగ్స్ స్పష్టం చేసింది.
ఐపీఎల్ 2023 మినీ వేలంలో తమ సంప్రదాయానికి విరుద్దంగా రూ. 16.25 కోట్ల భారీ ధర పెట్టి బెన్ స్టోక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. అతని మొకాలికి గాయం కావడంతో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి.. సీజన్ మొత్తం దూరంగానే ఉన్నారు. భారత్‌తో టెస్ట్ సిరీస్‌తో పాటు వన్డే ప్రపంచకప్ 2024 నేపథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ ఆడనని బెన్ స్టోక్స్.. సీఎస్‌కేకు సమాచారమిచ్చాడు. దీంతో అతనికి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గత నాలుగు రోజుల క్రితమే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది.
చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసిన ఆటగాళ్ల జాబితా:
బెన్ స్టోక్స్, డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుభ్రాన్షు సేనాపతి, అంబటి రాయుడు, కైల్ జెమీసన్, ఆకాశ్ సింగ్, సిసండా మగలా
చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్డ్ లిస్ట్:
మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజవర్ధన్ హంగార్గేకర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతీష పతీరణ, సిమ్రాన్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలాంకి, మహీశ్ తీక్షణ, అజింక్యా రహానే, షేక్ రషీద్, నిశాంత్ సిందు, అజయ్ మండల్