ముంబై ఇండియన్స్ తరుపున టాప్ రన్ స్కోరర్‌గా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ... సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వేసిన అర్జున్ టెండూల్కర్...
ఐపీఎల్ 2023 సీజన్‌ని పుట్టెడు కష్టాలతో ప్రారంభించింది ముంబై ఇండియన్స్. జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరం అయితే ఆ లోటు తీరుస్తాడని అనుకున్న జోఫ్రా ఆర్చర్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడి గాయపడ్డాడు. అయితే కీ బౌలర్లు లేకపోయినా ముంబై ఇండియన్స్ వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది...
ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి ఐపీఎల్ 2023 సీజన్‌లో బోణీ కొట్టిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. అయితే ఈ రెండూ కూడా ఛేదనలో వచ్చిన విజయాలే కావడంతో ముంబై ఇండియన్స్ బౌలర్లపై పెద్దగా నమ్మకాలు మాత్రం లేవు..
అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలిచి, స్టార్లు లేకపోయినా తమ టీమ్ బౌలింగ్ కూడా బలంగానే ఉందని నిరూపించుకుంది ముంబై ఇండియన్స్. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదటి స్పెల్‌తో 2 ఓవర్లలతో పాటు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ కూడా వేసి, ముంబైని గెలిపించాడు...
ముంబై ఇండియన్స్ టీమ్‌కి కీ బ్యాటర్‌గా మారిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్‌తో చేసిన చిన్న ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందా టీమ్. ‘నువ్వు మా యార్కర్ కింగ్‌వి. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు కావాల్సినప్పుడు బౌలింగ్ చేయడం ఒత్తిడి కలిగించిందా?’ అంటూ అడిగాడు తిలక్ వర్మ..
దానికి అర్జున్.. ‘నాకు అలాంటి ప్రెషర్ ఏమీ కలగలేదు. ఎందుకంటే 20 పరుగులు అంటే ఈజీగా డిఫెండ్ చేయొచ్చు. నేను చాలా ప్రాక్టీస్ చేశాడు కానీ డిఫెండ్ చేయగలనని పూర్తిగా నమ్మాను....’ అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్ టెండూల్కర్..
‘మా ఇంట్లో ఫుడ్ ఎలా అనిపించింది’ అని తిలక్ వర్మ అడడగా, ‘చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. నేను ఫుడ్డీని. నాకు బిర్యానీ, మటన్, చికెన్ అన్నీ బాగా నచ్చాయి...’ అంటూ కామెంట్ చేశాడు అర్జున్ టెండూల్కర్..
అర్జున్ టెండూల్కర్‌కి ఆఖరి ఓవర్ ఇచ్చే సమయానికే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి ఖరారైపోయింది. కారణం అప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్లన్నీ కోల్పోయింది. చివరి ఓవర్‌లో 20 పరుగులు కావాలి. అయితే రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ తర్వాత మ్యాచ్‌లో ఏదైనా జరగవచ్చనే నమ్మకం ఫ్యాన్స్‌కి పెరిగింది..
అదీకాక అబ్దుల్ సమద్ భారీ సిక్సర్లు కొట్టడంలో దిట్ట. దీంతో రెండో మ్యాచ్ ఆడుతున్న అర్జున్ టెండూల్కర్‌కి ఆఖరి ఓవర్ ఇచ్చి, రోహిత్ శర్మ రిస్క్ చేస్తున్నాడా? అనిపించింది. అయితే మొదటి ఓవర్‌లో మొదటి బంతికే తన సత్తా నిరూపించుకున్నాడు అర్జున్ టెండూల్కర్. తొలి బంతికి లో ఫుల్ టాస్ వేసి అబ్దుల్ సమద్‌కి అవకాశం ఇవ్వని అర్జున్ టెండూల్కర్, పరుగులేమీ రాకుండా అడ్డుకోగలిగాడు...
ఆ తర్వాతి బంతికి అబ్దుల్ సమద్ రనౌట్ కావడంతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం ఖరారైపోయింది. ఆ తర్వాత మూడు బంతుల్లో 3 పరుగులే ఇచ్చిన అర్జున్ టెండూల్కర్, ఆఖరి ఓవర్ ఐదో బంతికి భువనేశ్వర్ కుమార్‌ని అవుట్ చేశాడు.
