Asianet News TeluguAsianet News Telugu

‘సామి.. సామి’అంటూ డాన్స్ అదరగొట్టిన గవాస్కర్.. వీడియో వైరల్..

IPL 2023:  రెండ్రోజుల క్రితం అహ్మదాబాద్ వేదికగా మొదలైన ఐపీఎల్  లో ప్రారంభ వేడుకలు  ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు  రష్మిక మందన్న, తమన్నా భాటియాల డాన్స్ తో అదరగొట్టారు. 

IPL 2023: Sunil Gavaskar Shake Legs To Saami Saami Song During IPL 2023 Opening Ceremony MSV
Author
First Published Apr 2, 2023, 12:15 PM IST

శుక్రవారం    అహ్మదాబాద్ లోని  ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో  ఘనంగా మొదలైన ఐపీఎల్ - 16  లో  ఆరంభ వేడుకలు కూడా అదిరిపోయాయి.    బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ తో  పాటు   నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మిల్కీ  బ్యూటీ తమన్నా భాటియా  లు తమ నృత్య ప్రదర్శనతో అలరించారు.  అయితే ఈ వేడుకల్లో రష్మిక, తమన్నాతో పాటు టీమిండియా దిగ్గజం  సునీల్ గవాస్కర్ కూడా  కాలు కదిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. 

ఆరంభ వేడుకల్లో  రష్మిక  స్టేజీ మీద పలు తెలుగు పాటలకు డాన్స్ చేసిన విషయం తెలిసిందే.  ఇందులో  అల్లు అర్జున్ నటించిన   ‘పుష్ప’ సినిమాలోని  ‘సామి సామి’ పాటకు తన ట్రేడ్ మార్క్ స్టెప్పులతో అలరించింది.  రష్మిక  గ్రౌండ్ లో ఈ   పాటకు ప్రదర్శన  చేస్తుండగా కామెంట్రీ బాక్స్ లో ఉన్న  సునీల్ గవాస్కర్ కూడా   తనలోని  డాన్సర్ తో పాటు సింగర్ ను కూడా బయటకు తీశాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neroli Meadows (@nezm)

రష్మిక డాన్స్ ను చూస్తూ ‘సామి.. సామి’ అంటూ పాడుకుంటూనే  కాలు కదిపాడు. కామెంట్రీ బాక్స్ లో  ఉన్న   సంజయ్ మంజ్రేకర్,  సైమన్ డౌల్  లు సన్నీ డాన్స్ చేస్తుంటే చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.  ఇందుకు సంబంధించిన వీడియోను   ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్  ప్రెజంటర్  నీరోలి మీడోస్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.    ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  

గవాస్కర్  డాన్స్ చేయడం ఇదే కొత్త కాదు.  కొద్దిరోజుల క్రితమే ఈ దిగ్గజం  ఆస్కార్ సాధించిన తెలుగు పాట  ‘నాటు నాటు’కు  కూడా డాన్స్ చేసిన విషయం తెలిసిందే.  మార్చి 13న   నాటు నాటుకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా.. భారత్ - ఆస్ట్రేలియా  నాలుగో టెస్టు  మ్యాచ్ ఐదో రోజు ఉదయం స్టార్ స్పోర్ట్స్ (తెలుగు) కామెంటేటర్స్  నాటు నాటు గురించి మాట్లాడుకుంటుండగా  అక్కడికి గవాస్కర్ వచ్చారు.  

 

‘ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా.  ట్రిపుల్ ఆర్ టీమ్ కు శుభాభివందనాలు. సంగీత దర్శకుడు,  రచయిత తో పాటు టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు. నేను ఇటీవలే ఆ సినిమా చూశాను.  అద్భుతంగా ఉంది.  అంతర్జాతీయ వేదికలపై మరిన్ని అవార్డులు గెలిచేందుకు ఇది  పునాది కావాలి...’అని   అన్నాడు. ఆ తర్వాత నాటు నాటు  పాటకు ఎన్టీఆర్, రాంచరణ్ ల  సిగ్నేచర్ మూమెంట్ తో  అలరించడం గమనార్హం. ఈ వీడియో కూడా గతంలో వైరల్ గా మారింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios