Asianet News TeluguAsianet News Telugu

హర్షా భోగ్లే, రవిశాస్త్రిలకు షాకిచ్చిన స్టార్ స్పోర్ట్స్.. ఐపీఎల్ కొత్త కామెంటరీ ప్యానెల్ ఇదే..

IPL 2023: మరో  పది రోజుల్లో  మొదలుకానున్న ఇండియన్  ప్రీమియర్ లీగ్ -16 సీజన్ కు గాను స్టార్ స్పోర్ట్స్  కామెంట్రీ ప్యానెల్ ప్రకటించింది. ఈ   ప్యానెల్  లో ప్రసిద్ధ  కామెంటేటర్ హర్షా భోగ్లే లేడు. 

IPL 2023: Star Sports Announce Commentary List, Harsha Bhogle and Ravi Shastri Misses Out  MSV
Author
First Published Mar 21, 2023, 7:59 PM IST

ఈనెల  31 నుంచి  మొదలుకానున్న ఐపీఎల్ - 16  కోసం అభిమానులు  వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు.  2019 తర్వాత ‘హోం అండ్ అవే’ విధానంలో జరుగుతున్న ఈ  టోర్నీలో మ్యాచ్ లను తమ సొంత నగరాల్లో   ఆస్వాదించేందుకు  పది ఫ్రాంచైజీల  అభిమానులు  ఎదురుచూస్తున్నారు. ఇక  టెలివిజన్,  యాప్ ద్వారా కూడా అభిమానులను అలరించే ఈ  బిగ్ సీజన్ కోసం ఐపీఎల్ టీవీ హక్కులను దక్కించుకున్న  స్టార్ స్టోర్స్ తో పాటు డిజిటల్ హక్కులను   చేజిక్కించుకున్న  వయాకామ్ 18 (జియో) కూడా ఇప్పటికే హంగామా మొదలుపెట్టాయి. 

తాజాగా  స్టార్ స్పోర్ట్స్.. ఈ సీజన్ లో  ఐపీఎల్ ను తమ అద్భుతమైన   స్కిల్స్‌తో  ప్రెజెంట్ చేసే కామెంటేటర్స్ లిస్ట్ ను  ప్రకటించింది.  అయితే ఈ లిస్ట్ లో   ప్రఖ్యాత కామెంటేటర్  హర్షా భోగ్లే తో పాటు  మ్యాచ్ లను  చూడటమే కాదు.. వింటే కూడా రసవత్తరంగా మార్చేస్తా అన్నట్టు కామెంట్రీ చెప్పే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిలను పక్కనబెట్టింది. 

హర్షా, శాస్త్రిలు చాలాకాలంగా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ లతో పాటు  ఐపీఎల్ లో కూడా   కామెంట్రీ చెప్పినవారే.   ముఖ్యంగా స్టార్ స్పోర్ట్స్ తో  అయితే ఈ ఇద్దరి బంధం చాలా ఏండ్ల నుంచి సాగుతున్నది.  కానీ ఈసారి ఈ ఇద్దరికీ  కామెంట్రీ ప్యానెల్ లో చోటు దక్కలేకపోవడం గమనార్హం. 

జాబితా ఇదే : 

ఐపీఎల్ టీవీ హక్కులను దక్కించుకున్న  స్టార్ స్పోర్ట్స్.. ఈ మ్యాచ్ లను 9 భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ మేరకు  ఆయా భాషల్లో కామెంట్రీ చెప్పే వారి జాబితాను విడుదల చేసింది. 

ఇంగ్లీష్ : సునీల్ గవాస్కర్, జాక్వస్ కలిస్, మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, ఆరోన్ ఫించ్, టామ్ మూడీ, పాల్ కాలింగ్‌వుడ్, డానియల్ వెటోరి, డానియల్ మోరీసన్, డేవిడ్ హస్సీ 

హిందీ : వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, మిథాలీ రాజ్, మహ్మద్  కైప్, సంజయ్ మంజ్రేకర్, ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా), దీప్ దాస్ గుప్తా,  అజయ్ మెహ్రా,  పద్మజీత్ సెహ్రావత్, జతిన్ సప్రు, కె.శ్రీకాంత్, ఎస్.బద్రీనాథ్, లక్ష్మీపతి బాలాజీ, ఎస్.రమేశ్, మురళీ విజయ్ 

తమిళ్ : ఆర్జే బాలాజీ,  యెమ్హేశ్, ముత్తురామన్, కెవి సత్యనారాయణన్, తిరుష్ కమిని 

తెలుగు : ఎంఎస్కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి.సుమన్, కళ్యాణ్ కృష్ణ, ఆశిష్ రెడ్డి,  కౌశిక్, యాంకర్ రవి 

కన్నడ : విజయ్ భరధ్వాజ్, శ్రీనివాస మూర్తి,  పి. భరత్, పవన్ దేశ్పాండే, అఖిల్, అనిల్ కుమార్, సుమేశ్ గోని, గుండప్పా విశ్వనాథ్, రూపేశ్ శెట్టి 

మరాఠీ : అమోల్ మజుందార్, సందీప్ పాటిల్, ఆదిత్య తారె, నీలేశ్ నటు, ప్రసాద్ క్షీరసాగార్ 

మళయాళం : ఎస్. శ్రీశాంత్, టిను యొహనన్, శియాస్ మహ్మద్, విష్ణు హరిహరన్ 

గుజరాతి : మనన్ దేశాయ్, ఆకాశ్ త్రివేది, నయన్ మోంగియా 

బంగ్లా (బెంగాల్) : అశోక్ దిండా, ఆర్జే వరుణ్ కౌశిక్, ప్రదీప్ రాయ్,  పల్లబ్ బసు, అభిషేక్  ఝున్‌ఝున్‌వాలా 

కాగా..  హర్షా, శాస్త్రితో పాటు  విండీస్ దిగ్గజం ఇయాన్ బిషప్  వాయిస్ కూడా  ఐపీఎల్ ప్రేక్షకులు మిస్ కానున్నారు.   అయితే శాస్త్రి, హర్షా లు జియో  లో లేదా బీసీసీఐ నుంచి  కామెంట్రీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని  క్రికెట్ వర్గాలలో  చర్చ సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios