IPL 2023, RR vs LSG: ఐపీఎల్ - 16 లో టేబుల్ టాపర్స్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ - లక్నో సూపర్ జెయింట్స్ లు ఈ సీజన్ లో మొదటిసారి ‘ఢీ’కొనబోతున్నాయి. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ - 16 లో నేడు మరో అగ్రశ్రేణి జట్ల పోరాటం. గత సీజన్ లో ప్లే ఆఫ్స్ చేరిన జట్లుగా ఉన్న రాజస్తాన్ రాయల్స్ - లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ లో ఫస్ట్ టైమ్ తలపడుతున్నాయి. జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా నాలుగేండ్ల తర్వాత జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ బ్యాటింగ్ కు రానుంది.
ఈ సీజన్ లో ఇప్పటివరకు అన్ని జట్లూ ఐదేసి మ్యాచ్ లు ఆడగా రాజస్తాన్ - లక్నోలు టేబుల్ టాపర్స్ గా ఉన్నాయి. ఐదు మ్యాచ్ లు ఆడిన రాజస్తాన్.. నాలుగింటిలో గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. లక్నో కూడా ఐదు మ్యాచ్ లే ఆడి మూడింట్లో విజయాలు సాధించి ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్.. హైదరాబాద్ తో గెలిచి తర్వాత మ్యాచ్ లో పంజాబ్ తో ఓడినా అనంతరం పుంజుకుంది. తర్వాత ఢిల్లీ, చెన్నై, గుజరాత్ లను ఓడించి ‘టాప్’గేర్ లో దూసుకుపోతున్నది. గుజరాత్ తో మ్యాచ్ లో విఫలమైన ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ లు రాణిస్తే లక్నోకు చుక్కలే. సంజూ శాంసన్, పడిక్కల్, షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ లతో పాటు అశ్విన్ కూడా బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. బౌలింగ్ లో కూడా రాజస్తాన్ బలంగా ఉంది. ట్రెంట్ బౌల్ట్, చాహల్, అశ్విన్ లకు తోడు సందీప్ శర్మ కూడా రాణిస్తున్నాడు.
ఇక లక్నో విషయానికొస్తే.. ఆర్సీబీ తో మ్యాచ్ లో ఇచ్చిన విజయం ఆ జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కానీ మూడు రోజుల క్రితం పంజాబ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవాలని, నేటి మ్యాచ్ తో మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తున్నది. కెఎల్ రాహుల్ ఆడుతున్నా అతడి స్ట్రైక్ రేట్ ఆందోళనకరంగా ఉంది. ఆరంభంలో వికెట్లు పడితే అతడు బాల్ కు ఓ పరుగు అన్నట్టుగా ఆడుతున్నాడు. దీపక్ హుడా ఇప్పటవరకు తన మార్క్ చూపలేదు. పూరన్, స్టోయినిస్ మీదే ఆ జట్టు గంపెడాశలు పెట్టుకుంది. బౌలింగ్ లో మార్క్ వుడ్, మొన్న ఫస్ట్ మ్యాచ్ ఆడిన యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్ లతో పాటు కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్ లతో ఆ జట్టు బౌలింగ్ కూడా దృఢంగానే ఉంది.
తుది జట్లు : ఈ మ్యాచ్ లో రాజస్తాన్ తరఫున గత మ్యాచ్ లో ఆడిన ఆడమ్ జంపా స్థానంలో జేసన్ హోల్డర్ వచ్చాడు.
రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, జేసన్ హోల్డర్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, అయుష్ బదోని, నవీన్ ఉల్ హక్, యుధ్వీర్ సింగ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
