IPL 2023, RR vs LSG: ఐపీఎల్ -16లో టేబుల్ టాపర్ రాజస్తాన్ రాయల్స్ కు లక్నో ఊహించని షాకిచ్చింది.    నాలుగేండ్ల తర్వాత సొంత గ్రౌండ్  (జైపూర్) లో  ఫస్ట్ మ్యాచ్ ఆడిన ఆ జట్టు పై  లక్నో అనూహ్య విజయాన్ని అందుకుంది. 

ఐపీఎల్ -16లో టేబుల్ టాపర్స్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ కు లక్నో సూపర్ జెయింట్స్ షాకిచ్చింది. సొంత గ్రౌండ్‌ జైపూర్ లో నాలుగేండ్ల తర్వాత మ్యాచ్ ఆడిన రాజస్తాన్.. ఫస్ట్ లక్నో సూపర్ జెయింట్స్ 154 పరుగులకే పరిమితమైనా లక్ష్య ఛేదనలో రాజస్తాన్ చివర్లో తడబడి అపజయాన్ని కొనితెచ్చుకుంది. లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ సేన.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా లక్నో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జోస్ బట్లర్ (41 బంతుల్లో 40, 4 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (35 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (21 బంతుల్లో 26, 4 ఫోర్లు ) రాణించినా రాజస్తాన్ కు ఓటమి తప్పలేదు. ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆరు మ్యాచ్ లలో ఇది రెండో ఓటమి. లక్నోకు ఆరు మ్యాచ్ లలో నాలుగో గెలుపు.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ హడావిడికి పోలేదు. రాజస్తాన్ ఓపెనర్లు స్లో పిచ్ పై లక్నో బౌలర్లకు ఎలాంటి అవకాశమివ్వకుండా ఆడారు. వారి సహజమైన ఆటకు భిన్నంగా బ్యాటింగ్ చేశారు. మంచి బంతులనను గౌరవిస్తూనే చెత్త బంతులను బౌండరీ లైన్ దాటించారు. 

అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో జైస్వాల్ రెండు ఫోర్లు కొట్టగా చివరి బంతిని బట్లర్ కూడా బౌండరీ బాదాడు. స్టోయినిస్ వేసిన ఏడో ఓవర్లో ఆఖరి బంతికి జైస్వాల్ సింగిల్ తీయడంతో రాజస్తాన్ స్కోరు 50 పరుగులు దాటింది. 10 ఓవర్లకు రాజస్తాన్.. వికెట్ఖ నష్టపనోకుండా 73 పరుగులే చేసింది. 

వరుసగా 3 వికెట్లు.. 

సాధించాల్సిన లక్ష్యమేమీ భారీగా లేకపోవడం.. చేతిలో పది వికెట్లు ఉండటంతో రాజస్తాన్ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. స్టోయినిస్ వేసిన 12వ ఓవర్లో ఫస్ట్ బాల్ కే బౌండరీ కొట్టిన జైస్వాల్.. అదే ఓవర్లో మూడో బాల్ కు కట్ షాట్ ఆడబోయి అవేశ్ ఖాన్ చేతికి చిక్కాడు. దీంతో 87 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. రవి బిష్ణోయ్ వేసిన 13వ ఓవర్లో నాలుగో బంతికి సంజూ శాంసన్ (2) రనౌట్ అయ్యాడు. స్టోయినిస్ వేసిన 14వ ఓవర్లో బట్లర్ కూడా రవి బిష్ణోయ్ ఔటయ్యాడు. నవీన్ ఉల్ హక్ వేసిన 15వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీయడం ద్వారా రాజస్తాన్ స్కోరు 100 దాటింది. 

Scroll to load tweet…

మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్.. 

ఆఖరి 5 ఓవర్లలో రాజస్తాన్‌కు 51 పరుగులు చేయాల్సి ఉండగా అవేశ్ ఖాన్ వేసిన షిమ్రన్ హెట్మెయర్ (2) లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడి కెఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో ఈ మ్యాచ్ లో కూడా ఉత్కంఠ ముగింపు తప్పలేదు. స్టోయిని్ వేసిన 18వ ఓవర్లో దేవదత్ పడిక్కల్.. మూడు ఫోర్లు కొట్టాడు. 12 బంతుల్లో 29 పరుగులు చేయాల్సి ఉండగా నవీన్ ఉల్ హక్ వేసిన 19వ ఓవర్లో 10 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా రాహుల్.. అవేశ్ ఖాన్ కు బంతినిచ్చాడు. ఫస్ట్ బాల్ కు రియాన్ పరాగ్ బౌండరీ కొట్టాడు. రెండో బాల్ కు సింగిల్ వచ్చింది. మూడో బాల్ కు పడిక్కల్ ఔటయ్యాడు. మూడు బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా అవేశ్.. ధ్రువ్ జురెల్ ను ఔట్ చేయడంతో పాటు చివరి రెండు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు.

ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (51) హాఫ్ సెంచరీతో ఆదుకోగా కెఎల్ రాహుల్ (39) నికోలస్ పూరన్ (29) ఫర్వాలేదనిపించారు.