IPL 2023 RCB vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్... ఫాఫ్ డుప్లిసిస్‌కి గాయం, ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ..
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు మొహాలీలో పంజాబ్ కింగ్స్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు తాత్కాలిక కెప్టెన్ సామ్ కుర్రాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఆర్‌సీబీ రెగ్యూలర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ గాయం కారణంగా నేటి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ నేటి మ్యాచ్‌లో ఆర్‌సీబీని నడిపించబోతున్నాడు.
మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ని ఓడించిన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి కమ్‌బ్యాక్ విజయం అందుకున్న ఆర్‌సీబీ, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి 8 పరుగుల తేడాతో ఓడింది...
మరోవైపు పంజాబ్ కింగ్స్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. మొదటి రెండు మ్యాచుల్లో గెలిచిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. లక్నో సూపర్ జెయింట్స్‌ని ఓడించి కమ్‌బ్యాక్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్... ఆర్‌సీబీని ఓడించి టాప్ 3లోకి దూసుకెళ్లాలని అనుకుంటోంది...
గాయంతో మొదటి ఆరు మ్యాచులకు దూరమైన లియామ్ లివింగ్‌స్టోన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అలాగే గత మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలో దిగని శిఖర్ ధావన్ నేటి మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు...
ఆర్‌సీబీ బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ మినహా మిగిలిన వారంతా ఫ్లాప్ అవుతున్నారు. పంజాబ్ కింగ్స్‌కి తాత్కాలిక సారథిగా వ్యవహరించిన సామ్ కుర్రాన్‌తో పాటు కగిసో రబాడా, అర్ష్‌దీప్ సింగ్, హార్‌ప్రీత్ బ్రార్ వంటి బౌలర్లతో పంజాబ్ కింగ్స్ పటిష్టంగా ఉంది...
రికార్డు స్థాయిలో రూ.18.50 కోట్ల భారీ ధర దక్కించుకున్న ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్, బ్యాటుతో మాత్రం చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. సికందర్ రజా గత మ్యాచ్‌లో రాణించాడు. శిఖర్ ధావన్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. లియామ్ లివింగ్‌స్టోన్ రాకతో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కష్టాలు కూడా తీరినట్టే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ అంతా టాపార్డర్‌పైనే ఆధారపడి ఉంది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ముగ్గురు మాత్రమే ఆడుతున్నారు. వీళ్లు ఆడితేనే అంతో ఇంతో స్కోరు చేయగలుగుతోంది ఆర్‌సీబీ. ఈ ముగ్గురూ ఫెయిల్ అయితే ఆర్‌సీబీ కూడా పేకమేడలా కూలుతోంది.. ఫాఫ్ డుప్లిసిస్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేస్తాడని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇది: విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, షాబజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వానిందు హసరంగ, సూయాశ్ ప్రభుదేశాయ్, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్
పంజాబ్ కింగ్స్ జట్టు ఇది: అథర్వ టైడ్, మాథ్యూ షాట్, హర్మన్‌ప్రీత్ భాటియా, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహార్, అర్ష్‌దీప్ సింగ్
