IPL 2023: 108 పరుగులకి ఆలౌట్ అయిన లక్నో, 18 పరుగుల తేడాతో గెలిచి, ప్రతీకారం తీర్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 257 పరుగుల భారీ స్కోరు చేసిన లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అందులో సగం కూడా లేని టార్గెట్‌ని ఛేదించలేకపోయింది. 127 పరుగుల లక్ష్యఛేదనలో 108 పరుగులకి ఆలౌట్ అయిన లక్నో, 18 పరుగుల తేడాతో ఓడింది..
కైల్ మేయర్స్‌ని డకౌట్ చేసిన సిరాజ్, ఆర్‌సీబీకి తొలి బ్రేక్ అందించాడు. సిరాజ్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కృనాల్ పాండ్యా, 11 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసి మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
11 బంతుల్లో 4 పరుగులు చేసిన ఆయుష్ బదోనీ, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. 2 బంతుల్లో 1 పరుగు చేసిన దీపక్ హుడా, హసరంగ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. వస్తూనే సిక్సర్ బాదిన నికోలస్ పూరన్, కర్ణ్ శర్మ బౌలింగ్‌లో మహిపాల్ లోమ్రోర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
38 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ దశలో మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్ కలిసి ఆరో వికెట్‌కి 27 పరుగులు జోడించారు. 19 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన స్టోయినిస్, కర్ణ్ శర్మ బౌలింగ్‌లో ప్రభుదేశాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన కృష్ణప్ప గౌతమ్ రనౌట్ కాగా 10 బంతుల్లో 5 పరుగులు చేసిన రవి భిష్ణోయ్ కూడా రనౌట్ రూపంలోనే పెవిలియన్ చేరాడు. 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జెయింట్స్..
15 ఓవర్లు ముగిసే సమయానికి 78 పరుగులు చేసిన లక్నో, చివరి 5 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సి వచ్చింది. సిరాజ్ వేసిన 17వ ఓవర్‌లో 8, హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్‌లో 9 పరుగులు రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. అయితే 13 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన నవీన్ వుల్ హక్, హజల్ వుడ్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
లక్నో విజయానికి ఆఖరి 8 బంతుల్లో 24 పరుగులు కావాల్సి వచ్చాయి. కెఎల్ రాహుల్ గాయంతోనే బ్యాటింగ్‌కి వచ్చాడు. మొదటి 2 బంతులతో పాటు ఓ నో బాల్, ఫ్రీ హిట్ వచ్చినా రాహుల్ బౌండరీ సాధించలేకపోయాడు.
దీంతో చివరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. మొదటి 2 బంతుల్లో పరుగులేమీ రాలేదు. మూడో బంతికి మిశ్రా ఫోర్ బాదగా కెఎల్ రాహుల్ అవతలి ఎండ్‌కి కూడా నడవలేకపోవడంతో స్ట్రైయిక్ రొటేట్ చేయడం కుదర్లేదు. 30 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన మిశ్రా, కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో లక్నో కథ ముగిసింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేయగలిగింది. 30 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 11 బంతుల్లో 9 పరుగులు చేసిన అనుజ్ రావత్, కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
5 బంతుల్లో 4 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేసిన సుయాశ్ ప్రభుదేశాయ్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ సమయంలో మ్యాచ్‌కి అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచే సమయానికి 15.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు మాత్రమే చేయగలిగింది. అరగంట తర్వాత తిరిగి ప్రారంభమైన ఆటను దినేశ్ కార్తీక్ బౌండరీతో ప్రారంభించాడు...
అమిత్ మిశ్రా బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ సిక్సర్ బాదడంతో పిచ్ మారిపోయిందని అనుకున్నారంతా. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 40 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కృనాల్ పాండ్యాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
4 బంతుల్లో 3 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్, నవీన్ వుల్ హక్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన మురళీ కార్తీక్, యష్ ఠాకూర్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యాడు..
కీలకమైన 18, 19వ ఓవర్లలో ఐదేసి పరుగులే చేశారు ఆర్‌సీబీ బ్యాటర్లు. ఆఖరి ఓవర్‌లో కర్ణ్ శర్మ, కృష్ణప్ప గౌతమ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా మహ్మద్ సిరాజ్, నికోలస్ పూరన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. సిరాజ్ అవుట్ విషయంలో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న లక్నోకి అనుకూలంగా ఫలితం వచ్చింది.
