Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్-16 విన్నర్, రన్నరప్‌లకు దక్కేది ఎంత..? ప్రైజ్ మనీ డిటేయిల్స్

IPL 2023 Prize Money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -  2023 ఎడిషన్ లో రేపు (ఆదివారం) ఫైనల్ జరుగనుంది. గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ లు అహ్మదాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

IPL 2023 Prize Money Details, How much money will the Winners and Runners get MSV
Author
First Published May 27, 2023, 4:51 PM IST

మూడేండ్ల తర్వాత  హోం అండ్ అవే ఫార్మాట్‌లో క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్) ముగింపు దశకు చేరింది.   ఆదివారం (మే 28న)  అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య  ఫైనల్ జరుగనుంది.  ఈ నేపథ్యంలో   కోటానుకోట్ల వ్యాపారం జరుగుతున్న ఐపీఎల్ లో  విజేతలు,  రన్నరప్స్ తో పాటు  ప్లేఆఫ్స్ ‌లోకి చేరిన జట్లు ఎంత పొందుతాయి..?  అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన  ఆటగాళ్లకు ఎంత ఇస్తారు..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం.. 

ఐపీఎల్ లో మొత్తం ప్రైజ్ మనీ.. రూ. 46.5 కోట్లుగా  నిర్దేశించారు.  ఇందులో  ట్రోఫీ నెగ్గినవారికి  రూ.  20  కోట్లు, రన్నరప్‌కు  రూ.  13 కోట్లు దక్కుతాయి.  మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 7 కోట్లు, నాలుగో స్థానంలో ఉన్న జట్టుకు   రూ. 6.5 కోట్లు దక్కుతాయి. 

మరికొన్ని.. 

- ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే  ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాడికి  రూ. 15 లక్షలు అందుతాయి.
- అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (పర్పుల్ క్యాప్) కు కూడా రూ. 15 లక్షలు  దక్కుతాయి. 
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డ్ విజేతకు  రూ. 20 లక్షలు 
- మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ : రూ. 12 లక్షలు 
- గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ : రూ. 12 లక్షలు  
- పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : రూ. 12 లక్షలు 
- క్రాక్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్ : రూ. 12 లక్షలు 

ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో  ప్రైజ్ మనీని రూ. 20 కోట్లుగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. మరి లీగ్ ప్రారంభ ఎడిషన్ (2008) లో  ఐపీఎల్ ట్రోఫీ విన్నర్ (రాజస్తాన్ రాయల్స్) కు ఎంత అమౌంట్ దక్కింది..?  కాలక్రమంలో అది ఎలా మారుతూ వచ్చింది..? ఆ వివరాలు ఇవి.. 

1. ఐపీఎల్ - 2008 : రూ. 4.8 కోట్లు (రాజస్తాన్ రాయల్స్)
2. ఐపీఎల్ - 2009 : రూ. 6 కోట్లు (డెక్కన్ ఛార్జర్స్) 
3. ఐపీఎల్ - 2010 : రూ. 8 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
4. ఐపీఎల్ - 2011 : రూ. 10  కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
5. ఐపీఎల్ - 2012 : రూ. 10 కోట్లు (కోల్కతా నైట్ రైడర్స్)
6. ఐపీఎల్ - 2013 : రూ. 10 కోట్లు (ముంబై ఇండియన్స్)
7. ఐపీఎల్ - 2014 : రూ. 15 కోట్లు (కోల్కతా నైట్ రైడర్స్)
8. ఐపీఎల్ - 2015 : రూ. 15 కోట్లు (ముంబై ఇండియన్స్)
9. ఐపీఎల్ - 2016 : రూ. 20 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
10. ఐపీఎల్ - 2017  : రూ. 15  కోట్లు ముంబై ఇండియన్స్)
11. ఐపీఎల్ - 2018 : రూ. 20 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
12. ఐపీఎల్ - 2019 : రూ. 20 కోట్లు ముంబై ఇండియన్స్)
13. ఐపీఎల్ - 2020 : రూ. 10 కోట్లు (కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ సీజన్ లో ప్రైజ్ మనీని సగానికి తగ్గించారు) (ముంబై ఇండియన్స్)
14. ఐపీఎల్ - 2021 : రూ. 20  కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
15. ఐపీఎల్ - 2022 : రూ. 20 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
ఐపీఎల్ - 16 లో కూడా ప్రైజ్ మనీలో మార్పులేమీ లేవు. 

Follow Us:
Download App:
  • android
  • ios