IPL 2023:  ఐపీఎల్ - 16లో గురువారం  పంజాబ్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య  ముగిసిన మ్యాచ్  లో గుజరాత్ ఉత్కంఠ విక్టరీతో అలరించింది.  ఈ మ్యాచ్ తర్వాత షమీ  ట్విటర్ లో ట్రెండ్ అయ్యాడు. 

లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లు, బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగుతున్న ఐపీఎల్ -16లో ఆటలో ఎలా ఉన్నా గేమ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లంతా ఒకచోటుకు చేరి కబుర్లు చెప్పుకుంటుండటం చూస్తూనే ఉన్నాం. ఇది ఫ్రెండ్లీ గేమ్ కు స్ఫూర్తి. అయితే నిన్న పంజాబ్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత ఓ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలో గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ షమీ.. బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా లు చిరునవ్వులు చిందించారు. 

ఉత్కంఠభరితంగా ముగిసిన ఈ మ్యాచ్ లో గుజరాత్ మరో బంతి మిగిలుండగానే 154 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే షమీ.. ప్రీతి జింతాతో కలిసి కాసేపు మాట్లాడాడు. ఇద్దరూ మనసారా నవ్వుతుండటంతో ఫ్యాన్స్ ఈ ఫోటోకు కొత్త అర్థాలు చెబుతున్నారు. 

Scroll to load tweet…

‘ఈ నవ్వులు కొత్త బంధానికి దారితీస్తాయా..?’ అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే ‘మగాళ్ల హృదయాలు కొల్లగొట్టడంలో ప్రీతి జింతా స్టైలే వేరు’ మరో ట్విటర్ యూజర్ కామెంట్ చేశాడు. ఇక తెలుగు ట్రోల్ పేజీలలో అయితే జాతిరత్నాలు సినిమాలో ఇద్దరు టీచర్లు మాట్లాడుకుంటుండగా నవీన్ పొలిశెట్టి అండ్ గ్యాంగ్ అల్లరి చేసే మీమ్ తో పాటు వెంకీ సినిమాలో రవితేజను చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డిలు ఆటపట్టించే మీమ్స్ తో అలరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, మీమ్స్ ఇప్పుడు యూజర్లను అలరిస్తున్నాయి. ఈ ఫోటో వైరల్ అయ్యాక ట్విటర్ లో #Shamita (షమీ - ప్రీతి జింటా) కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.