IPL 2023: ఐపీఎల్ -16 లో  హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ముంబై ఇండియన్స్  నేడు స్వంత మైదానంలో  పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.   ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్  జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

ఐపీఎల్ - 2023 ఎడిషన్ ను వరుసగా రెండు ఓటములతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్నది. ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్ లను ఓడించిన ముంబై.. నేడు పంజాబ్ తో తలపడుతున్నది. వాంఖెడే వేదికగా జరుగతున్న ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భుజం గాయం కారణంగా గత రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న శిఖర్ ధావన్.. ఈ మ్యాచ్ లో కూడా ఆడటం లేదు. ఇది పంజాబ్ కు ఎదురుదెబ్బే. 

బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు కూడా అనుకూలించే వాంఖెడే పిచ్ పై టాస్ గెలవగానే రోహిత్ మరో ఆలోచన లేకుండా ఛేదనకే మొగ్గుచూపాడు. ఇక్కడ రాత్రి పూట జరిగిన గత 32 టీ20 మ్యాచ్ లలో 22 సార్లు ఛేజింగ్ టీమ్సే విజయం సాధించాయి.

ఫస్ట్ బౌలింగ్ చేసే జట్టుకు పిచ్ నుంచి మంచి సహకారం అందుతుంది. స్పిన్నర్లకు వాంఖెడేలో వికెట్లు తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ లో ముంబై - చెన్నై, ముంబై - కోల్కతా మ్యాచ్ లలో కూడా ఇదే నిరూపితమైంది.

ఇక ఐపీఎల్ లో ముంబై - పంజాబ్ ల మధ్య 29 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో ముంబై దే పైచేయిగా ఉంది. ముంబై 15 మ్యాచ్ లు గెలవగా పంజాబ్ 14 మ్యాచ్ లలో విజయాలు సాధించింది. వాంఖెడేలో కూడా హోరాహోరి పోరు తప్పలేదు. ఇక్కడ ఇరు జట్లూ 9 సార్లు తలపడితే ముంబై ఐదు మ్యాచ్ లలో గెలిచింది. పంజాబ్ నాలుగుసార్లు విజయాలు సాధించింది. మరి నేటి మ్యాచ్ లో విజేత ఎవరో..? 

Scroll to load tweet…

తుది జట్లు : ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టుతో చేరాడు. 

పంజాబ్ కింగ్స్ : అథర్వ తైడే, ప్రభ్‌సిమ్రన్ సింగ్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టొన్, సామ్ కరన్ (కెప్టెన్), జితేశ్ శర్మ, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రర్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ 

ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ, అర్జున్ టెండూల్కర్, హృతీక్ షోకీన్, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, జేసన్ బెహ్రాండార్ఫ్