నువ్వు ఛాంపియన్‌వి, గట్టిగా తిరిగి వస్తావ్.. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్‌కి సపోర్ట్‌గా ట్వీట్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్..
ఎలాంటి అంచనాలు లేకుండా ఐపీఎల్ 2022 సీజన్‌ని ఆరంభించి, టైటిల్ విజేతగా నిలిచింది గుజరాత్ టైటాన్స్. దెబ్బకు హార్ధిక్ పాండ్యా టీమిండియా టీ20 కెప్టెన్ అయిపోయాడు. శుబ్‌మన్ గిల్, త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారాడు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా వరుసగా రెండు మ్యాచుల్లో నెగ్గిన గుజరాత్ టైటాన్స్, టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తోంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ టఫ్ ఫైట్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, యష్ దయాల్ వేసిన చివరి ఓవర్ కారణంగా పరాజయం పాలైంది..
మొదటి బంతికి సింగిల్ మాత్రమే ఇచ్చిన యష్ దయాల్, ఆ తర్వాత ఏకంగా 5 సిక్సర్లు సమర్పించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచుల్లో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేశాడు యష్ దయాల్. అయితే కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా రెస్ట్ తీసుకోవడంతో యష్ దయాల్‌తో 4 ఓవర్లు వేయించాడు తాత్కాలిక కెప్టెన్ రషీద్ ఖాన్..
అప్పటికే మహ్మద్ షమీ, జోషువా లిటిల్, అల్జెరీ జోసఫ్, రషీద్ ఖాన్ తమ కోటి పూర్తి చేసుకున్నారు. టీమ్‌లో ఉన్న విజయ్ శంకర్ బౌలింగ్ చేయగలడు. అయినా సరే రిస్క్ చేయడం ఇష్టం లేక యష్ దయాల్‌తో ఆఖరి ఓవర్ వేయించాడు రషీద్ ఖాన్. అప్పటికి 3 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చిన యష్ దయాల్, ఆఖరి ఓవర్ మొదటి బంతికి సింగిల్ ఇచ్చాడు..
20వ ఓవర్‌లో రెండు, మూడు, నాలుగు బంతులను ఫుల్ టాస్ వేసిన యష్ దయాల్, రింకూ సింగ్‌కి సిక్సర్లు సమర్పించాడు. ఐదో బంతికి స్లో బాల్ వేసిన యష్ దయాల్, వికెట్ కోసం ప్రయత్నించినా, రింకూ సింగ్ అతనికి అవకాశం ఇవ్వలేదు. ఆఖరి బంతికి కూడా సిక్సర్ బాది, ఐపీఎల్ చరిత్రలోనే అనితరసాధ్యమైన ఫీట్ సాధించాడు...
అద్వితీయ విజయాన్ని అందుకున్న కేకేఆర్, యష్ దయాల్‌కి అండగా నిలుస్తూ ట్వీట్ చేసి, అందరి మన్ననలు అందుకుంటోంది.. ‘గట్టిగుండు బిడ్డా! నువ్వు ఛాంపియన్‌వి.ఈ రోజు నీకు కలిసి రాలేదు అంతే. క్రికెట్‌లో బెస్ట్ ప్లేయర్లు అందరికీ ఇలా జరుగుతుంది. యష్, నువ్వు చాలా మంచి కమ్‌బ్యాక్ ఇస్తావ్’ అంటూ ట్వీట్ చేసింది కోల్‌కత్తా నైట్ రైడర్స్..
రింకూ సింగ్ సిక్సర్ల మోతకు దాదాపు ఏడిచేశాడు యష్ దయాల్. మ్యాచ్ ముగిసిన తర్వాత తన కన్నీళ్లను దాస్తూ ముఖానికి రిబ్బన్‌ని అడ్డుగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన రెండో బౌలర్‌గా నిలిచాడు యష్ దయాల్...ఇంతకుముందు 2018లో బెంగళూరుతో మ్యాచ్‌లో బాసిల్ తంపి, 4 ఓవర్లలో 70 పరుగులు ఇవ్వగా, యష్ దయాల్ 69 పరుగులు ఇచ్చాడు.
