Asianet News TeluguAsianet News Telugu

IPL 2023 KKR vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్... టాప్ పొజిషన్‌పైనే హార్ధిక్ పాండ్యా గురి...

IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... మరోసారి టీమ్‌లో మార్పులు చేసిన కోల్‌కత్తా నైట్ రైడర్స్.. 

IPL 2023 KKR vs GT: Gujarat titans won the toss and elected to field first, Kolkata Knight Riders CRA
Author
First Published Apr 29, 2023, 3:05 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది..

ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది సంచలన విజయం అందించాడు. ఆ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కి తాత్కాలిక సారథిగా వ్యవహరించిన రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీసి మ్యాచ్‌ని మలుపు తిప్పినా... రింకూ సింగ్ అద్వితీయ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్‌కి విజయం దక్కింది..

ఆ మ్యాచ్ విజయం తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన కోల్‌కత్తా నైట్‌ రైడర్స్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. 8 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకున్న కేకేఆర్, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా అవసరం. ఈ మ్యాచ్‌లో ఓడితే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో పడిపోతుంది కోల్‌కత్తా...

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో జాసన్ రాయ్, నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ అందరూ అదరగొట్టారు. నేటి మ్యాచ్‌లో కూడా అలాంటి పర్ఫామెన్స్ ఆశిస్తోంది కేకేఆర్...

బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తితో పాటు యంగ్ స్పిన్నర్ సుయాశ్ శర్మ కూడా అదరగొడుతున్నాడు. ఆండ్రే రస్సెల్ అప్పుడప్పుడూ బౌలింగ్ చేసినా, బంతి అందుకున్న ప్రతీసారీ వికెట్ తీశాడు...

మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కూడా జోరుమీదుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది గుజరాత్ టైటాన్స్.. శుబ్‌మన్ గిల్‌తో పాటు డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహార్ అదరగొట్టారు. రాహుల్ తెవాటియాకి బ్యాటింగ్ వచ్చిన సందర్భాలు తక్కువ అయినా క్రీజులోకి వచ్చిన ప్రతీసారీ తన స్టైల్‌లో ఇరగదీస్తున్నాడు...

బౌలింగ్‌లో రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, మహ్మద్ షమీలతో పాటు నూర్ అహ్మద్ కూడా అదరగొడుతున్నాడు. అయితే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా నుంచి సరైన ఇన్నింగ్స్ రాక చాలా రోజులైంది. హార్ధిక్ పాండ్యా అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో రాణించలేకపోతున్నాడు. అయితే టీమ్ మాత్రం లక్కీగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతోంది...

7 మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న గుజరాత్ టైటాన్స్, నేటి మ్యాచ్‌లో గెలిస్తే టాప్‌ పొజిషన్‌కి దూసుకెళ్తుంది. టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయిన కేకేఆర్, మరోసారి టీమ్‌లో మార్పులు మార్పులు చేసింది. గత రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీ చేసిన జాసన్ రాయ్‌ని పక్కనబెట్టి రెహ్మనుల్లా గుర్భాజ్‌ని తుది జట్టులోకి తెచ్చిన కేకేఆర్, హర్షిత్ రాణాకి అవకాశం ఇచ్చింది.

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహార్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోషువా లిటిల్

 

కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు: నారాయణ్ జగదీశన్. రెహ్మనుల్లా గుర్భాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వీజ్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios