IPL 2023: రాజస్తాన్ రాయల్స్  బౌలర్  ప్రసిధ్ కృష్ణ  ఐపీఎల్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడా..? మరి ఆ జట్టు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టుకు  అర్థమేంటి..?   

ఐపీఎల్ -16 టేబుల్ టాపర్స్ గా ఉన్న రాజస్తాన్ రాయల్స్ అభిమానులకు షాకిచ్చింది. గాయం కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకున్న ప్రసిధ్ కృష్ణ తిరిగి జట్టుతో కలుస్తున్నాడా..? నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో జైపూర్ లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో జరుగబోయే పోరుకు అతడు ఆడనున్నాడా..? మరి రాజస్తాన్ రాయల్స్ షేర్ చేసిన ఆ పోస్టుకు అర్థమేంటి..?

లక్నోతో మ్యాచ్ కు ముందు రాజస్తాన్.. తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రసిధ్ కృష్ణ రాజస్తాన్ రాయల్స్ ఉన్న హోటల్ కు వెళ్లడమే గాక ఆటగాళ్లను కలిశాడు. హెడ్ కోచ్ కుమార సంగక్కర అతడికి జెర్సీ అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసింది. 

వీడియోతో పాటు కుమార సంగక్కర అతడికి జెర్సీని అందించడం, రాజస్తాన్ ఆటగాళ్లతో కలిసి అతడు సందడి చేయడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ.. ‘ఏంటి ప్రసిధ్ ఈ మ్యాచ్ ఆడుతున్నాడా..? అతడి గాయం పూర్తిగా మానిందా..?, ప్రసిధ్ గనక బౌల్ట్ కు కలిస్తే ఇక రాజస్తాన్ కు ఎదురుండదు..’ అని కామెంట్ చేస్తున్నారు.

View post on Instagram

అయితే ఇదంతా రాజస్తాన్ సోషల్ మీడియా అడ్మిన్లు చేసిన మాయ. వాస్తవానికి ప్రసిధ్ సర్జరీ కారణంగా ఐపీఎల్ నుంచి దూరమయ్యాడు. అతడి స్థానంలోనే ఆ జట్టు సందీప్ శర్మ ను రిప్లేస్ చేసుకుంది. ఈ సీజన్ లో హోం గ్రౌండ్ జైపూర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్.. ప్రసిధ్ ను మ్యాచ్ చూసేందుకు ఆహ్వానించింది. దీంతో అతడు జైపూర్ లో రాజస్తాన్ రాయల్స్ కు మద్దతుగా అక్కడికి వచ్చాడు. అదీ కథ. ప్రసిధ్ పూర్తిగా కోలుకుని తిరిగి ఫిట్నెస్ సాధించాలంటే మరో రెండు నెలలు పట్టే అవకాశముంది. అతడు ఎన్సీఏలో రిహబిటేషన్ పొందుతున్నాడు. లక్నోతో మ్యాచ్ చూసేందుకు గాను జైపూర్ కు వచ్చాడు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

 కాగా నేటి రాత్రి రాజస్తాన్ రాయల్స్ - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మరో బిగ్ ఫైట్ జరుగనున్నది. ఈ రెండు జట్లు టేబుల్ టాపర్స్ గా ఉన్నాయి. ఈ సీజన్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన రాజస్తాన్.. నాలుగు విజయాలతో సూపర్ ఫామ్ లో ఉంది. లక్నో ఐదు మ్యాచ్ లలో మూడింటిలో గెలిచింది. నేడు జరుగబోయే మ్యాచ్ లో కూడా గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.


Scroll to load tweet…