Asianet News TeluguAsianet News Telugu

వార్ వన్‌సైడే... రెండో క్వాలిఫైయర్‌లో ముంబై ఇండియన్స్ చిత్తు! ఫైనల్‌కి గుజరాత్ టైటాన్స్...

IPL 2023: సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ, తిలక్ వర్మ మెరుపులు... 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ని చిత్తు చేసి వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్...

IPL 2023: Gujarat Titans beats Mumbai Indians and reaches final with Chennai Super Kings CRA
Author
First Published May 26, 2023, 11:59 PM IST

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్ చేరింది. లీగ్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, రెండో క్వాలిఫైయర్‌లో ముంబై ఇండియన్స్‌పై తిరుగులేని ఆధిపత్యం చూపించి, చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతోంది...

గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచి అట్టర్ ఫ్లాప్ అయిన ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌లో ఊహించని విధంగా ప్లేఆఫ్స్‌కి వచ్చినా ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది.. రెండో క్వాలిఫైయర్‌లో 62 పరుగుల తేడాతో ఓడిన ముంబై ఇండియన్స్, మూడో స్థానంతో ఐపీఎల్ 2023 సీజన్‌ని ముగించింది.. 

234 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌కి శుభారంభం దక్కలేదు. ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడడంతో అతని  స్థానంలో నేహాల్ వదేరా ఓపెనర్‌గా వచ్చాడు. 3 బంతుల్లో ఓ ఫోర్‌ బాదిన నేహాల్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

7 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా షమీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. కామెరూన్ గ్రీన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి హార్ధిక్ బౌలింగ్‌లో గాయపడడంతో రిటైర్ హార్ట్ అయ్యాడు. ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో 4, 4, 4, 4, 2, 6 బాది 24 పరుగులు రాబట్టాడు...

14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు చేసిన తిలక్ వర్మ, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ మధ్య 51 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది..

20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, జోషువా లిటిల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 124 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...

 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కాసేపు ఆశలు రేపాడు. అయితే సూర్యకుమర్ యాదవ్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన మోహిత్ శర్మ, అదేఓవర్‌లో  విష్ణు వినోద్‌నిపెవిలియన్ చేర్చాడు. 7 బంతుల్ల 5 పరుగులు చేసిన విష్ణు వినోద్ అవుట్ అయ్యే సమయానికి ముంబై విజయానికి 31 బంతుల్లో 78 పరుగులు కావాలి...

3 బంతుల్లో 2 పరుగులు చేసిన టిమ్ డేవిడ్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ ఓటమి ఖరారైపోయింది...  క్రిస్ జోర్డాన్ 2, పియూష్ చావ్లాని డకౌట్, కుమార్ కార్తికేయ 6లను అవుట్ చేసిన మోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ని 171 పరుగుల వద్ద  తెరదించాడు.

 అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో  3 వికెట్లు కోల్పోయి 233 పరుగుల భారీ స్కోరు చేసింది...  క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని టిమ్ డేవిడ్ జారవిడిచాడు. అప్పటికి 30 పరుగులు మాత్రమే చేసిన శుబ్‌మన్ గిల్ ఆ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటూ సీజన్‌లో మూడో సెంచరీ నమోదు చేశాడు... 

తొలి వికెట్‌కి వృద్ధిమాన్ సాహాతో కలిసి 53 పరుగుల భాగస్వామ్యం జోడించిన శుబ్‌మన్ గిల్,  మరోసారి తిలక్ వర్మ క్యాచ్ మిస్ చేయడంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు..

49 బంతుల్లో సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచాడు. ఈ సీజన్‌లో శుబ్‌మన్ గిల్‌కి ఇది మూడో సెంచరీ. ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తొలి ఐపీఎల్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రెండో సెంచరీ బాది ఆ టీమ్‌ ప్లేఆఫ్స్ ఛాన్సులపై నీళ్లు చల్లాడు..

ఒకే సీజన్‌లో మూడు, అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్ శుబ్‌మన్ గిల్. విరాట్ కోహ్లీ 2016లో 4 సెంచరీలు బాదగా, గత ఏడాది జోస్ బట్లర్ 4 సెంచరీలు చేశాడు..

IPL 2023: Gujarat Titans beats Mumbai Indians and reaches final with Chennai Super Kings CRA

60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆకాశ్ మద్వాల్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన సాయి సుదర్శన్, ఆఖరి ఓవర్‌లో రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్ చేరాడు.. రషీద్ ఖాన్ 5 పరుగులు చేయగా హార్ధిక్ పాండ్యా 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios