Asianet News TeluguAsianet News Telugu

సీజన్‌లో తొలిసారి ‘ఇంపాక్ట్’ చూపించిన రూల్.. జీటీ-కేకేఆర్ మ్యాచ్‌లో రికార్డులే రికార్డులు..

IPL 2023:  ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ముగిసిన  మ్యాచ్  ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.   ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. 

IPL 2023: From Rinku Singh 5 Sixes To Rashid Khan Hat Trick, Look at The  Records  in GT vs KKR game MSV
Author
First Published Apr 9, 2023, 10:06 PM IST

ఐపీఎల్‌-16 మొదలై పది రోజులు కావస్తోంది.   ఇప్పుడిప్పుడే ఈ లీగ్  అభిమానుల  అటెన్షన్ ను తన వైపునకు తిప్పుకుంటున్నది.   సాధారణంగా  వన్ సైడ్ మ్యాచ్ ల కంటే  అభిమానులు   ఉత్కంఠగా సాగుతూ చివరివరకూ విజయం నీదా నాదా అన్నట్టుగా సాగే మ్యాచ్ లనే ఇష్టపడతారు.  అవి లో స్కోరింగ్ థ్రిల్లర్‌లు అయినా  హై స్కోరింగ్ గేమ్స్ అయినా విజయం  ఇరు జట్ల మధ్య దోబూచూలాడాలి.  అప్పుడే ఆ ఆటకు అందం..  చూసే వాళ్లకు ఆనందం..  సరిగ్గా  ఆదివారం గుజరాత్ టైటాన్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇలాగే జరిగింది.  

ఈ సీజన్ లో   200+ టార్గెట్ చేసిన జట్టు (గుజరాత్) ఓడిపోవడం ఇదే  ప్రథమం కాగా  ఇంత భారీ స్కోరు చేసినా ఛేజింగ్ చేసి గెలవడమూ (కోల్కతా) ఇదే తొలిసారి.  ఈ మ్యాచ్ లో  చాలా విశేషాలు జరిగాయి. 

‘ఇంపాక్ట్’ చూపించాడు.. 

ఈ ఏడాది బీసీసీఐ ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కు ఈ మ్యాచ్ లో అసలైన న్యాయం జరిగింది.  గడిచిన పది రోజులుగా ఐపీఎల్ లో వివిధ జట్లు  ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ను వాడుతున్నా  సదరు ఆటగాళ్లు  మ్యాచ్ మీద ‘స్పష్టమైన ముద్ర’ వేయలేకపోయారు.  కానీ  ఈ మ్యాచ్ లో మాత్రం  సుయాశ్ శర్మ స్థానంలో  ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. గేమ్ మీద అసలైన ప్రభావం చూపాడు.  రావడం రావడమే సిక్సర్ బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేసిన అయ్యర్..  40 బంతుల్లోనే  8 బౌండరీలు, 5 ఫోర్లతో  83 పరుగులు చేసి వీరవిహారం చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు  అతడే. 

 

రషీద్ హ్యాట్రిక్.. 

కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా 17వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించాడు. ఐపీఎల్-16లొ ఇదే తొలి హ్యాట్రిక్.    ఆ ఓవర్లో రషీద్ వరుసగా  రసెల్, నరైన్, శార్దూల్ లను ఔట్ చేసి   హ్యాట్రిక్ పడగొట్టాడు.  గుజరాత్ తరఫున ఐపీఎల్ లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్ రషీద్ ఖానే కావడం విశేషం. మొత్తంగా టీ20 క్రికెట్ లో అతడికి ఇది నాలుగో హ్యాట్రిక్. అంతకముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్ లీగ్,  ఒక  అంతర్జాతీయ టీ20 హ్యట్రిక్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అతడు 3 హ్యాట్రిక్ లు తీసిన ఆండ్రూ టై, మహ్మద్ సమీ, అమిత్ మిశ్రా, ఆండ్రూ రసెల్, ఇమ్రాన్ తాహిర్ లను అధిగమించాడు.  ఐపీఎల్ లో కేకేఆర్ పై హ్యాట్రిక్ పడగొట్టిన నాలుగో బౌలర్ రషీద్. గతంలో ముఖయా ఎన్తిని, ప్రవీణ్ తాంబే, యుజ్వేంద్ర చహల్ లు కూడా  హ్యాట్రిక్ తీశారు. 

రింకూ సింగ్  ఊచకోత.. 

ఈ మ్యాచ్ లో  అసలు గెలుపు మీద ఆశలే లేని కేకేఆర్..  అనూహ్య విజయం సాధించిందంటే దానికి కారణం వెంకటేశ్ అయ్యర్ ఇన్నింగ్స్ తో పాటు రింకూ సింగ్ ది. చివరి ఓవర్లో ఐదు భారీ సిక్సర్లతో  దుమ్ము రేపిన రింకూ.. ఇలా చేసిన బ్యాటర్ల జాబితాలో   ఆరో వాడు. గతంలో  క్రిస్ గేల్  (2012), రాహుల్ తెవాటియా (2020), రవీంద్ర  జడేజా (2021), మార్కస్ స్టోయినిస్ (2022)  లు రింకూ కంటే ముందున్నారు.  

 

ఐపీఎల్ లో చివరి ఓవర్లో అత్యధిక పరుగులు ఛేదన చేసిన జట్టు కేకేఆరే కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్.. ఆరు బంతుల్లో 29 రన్స్ ను ‘ఉఫ్’మని ఊదేశాడు. గతంలో   హయ్యస్ట్ లాస్ట్ ఓవర్ ఛేజ్ చేసిన జట్లు గుజరాత్ (22, హైదరాబాద్ పై 2022లో,  రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్  (23, పంజాబ్ పై 2016లో) లు ఈ ఘనత సాధించాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios